తన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పు పై కృష్ణామోహన్ రెడ్డి స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశ్వపూర్వకంగా ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని ఆయన పేర్కొన్నారు. డీకే అరుణ కోర్టును తప్పుదోవ పట్టించారని కృష్ణామోహన్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని.. తప్పుడు అఫిడవిట్ చూపించి తన పైన అనర్హత వేటు అంటూ ప్రచారం చేశారని కృష్ణామోహన్ రెడ్డి చెప్పారు. డీకే అరుణ తనను రాజకీయంగా 20 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెట్టిందన్నారు. గద్వాల నియోజకవర్గానికి డీకే అరుణ.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు తాము చేస్తుంటే ఓర్వలేక ఇలాంటి ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు.
Read Also: New TTD Board: టీటీడీ పాలకమండలి ప్రకటన.. కొత్త సభ్యులు వీరే.
ఈ వ్యవహారంపై డీకే అరుణ పై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో డీకే అరుణ మూడో స్థానంలో ఉంటుందని విమర్శించారు కృష్ణామోహన్ రెడ్డి. టూరిస్ట్ లాగా వచ్చి పోయే డీకే అరుణకు నియోజకవర్గం గురించి ఏమీ తెలుసని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలు మళ్ళీ తనను గెలిపించాలని సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
Read Also: Rahul Gandhi: కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద రాహుల్ గాంధీ నివాళులు
ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కేసుపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీచేయగా.. డీకే అరుణ కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచారు.