జోగులాంబ గద్వాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నట్టు వార్తలు వచ్చాయి… టీఆర్ఎస్, బీజేపీ నేతల పోటాపోటీ నినాదాలు, కారు ధ్వంసం చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది.. అయితే, ఈ ఘటనపై స్పందించిన గద్వాల జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి.. అసలు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను మేం అడ్డుకోలేదు.. టీఆర్ఎస్‌కు సంబంధంలేదని తెలిపారు.
Read Also: Love couple: ప్రేమజంట ఆత్మహత్య.. నిన్న ప్రియుడు, నేడు ప్రియురాలు..
ఇక, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై స్థానికులు ప్రశ్నిస్తే.. వారిపై బీజేపీ శ్రేణులే దాడి చేశాయన్నారు కృష్ణ మోహన్‌రెడ్డి.. మరోవైపు, బండి సంజయ్ పాద యాత్రకు ప్రజా స్పందన లేదన్న ఆయన.. పాదయాత్ర కాక పోతే మోకాళ్ల యాత్ర చేసుకోండి తమకు అభ్యంతరం లేదు.. వాళ్లున్నది పిడికెడు మందే అని ఎద్దేవా చేశారు.. స్థానికులు ఎవరూ వారితో లేరు, ప్రజాదరణ లేదన్న ఆయన.. మేం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారం కాదని.. పాదయాత్రను తాము అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి.