PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్‌లో జరిగే జీ-20 సమ్మిట్ కోసం బయలుదేరారు. బ్రెజిల్ సహా గయానా, నైజీరియా దేశాల్లో పర్యటించనున్నారు. గతేడాది జీ-20 సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నైజీరియాలోలో పర్యటించబోతున్నారు.
అక్టోబర్ 13న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు(P20 Summit)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కెనడా కూడా పాల్గొననుంది. నిజానికి భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
గత 30 రోజుల్లో భారత దౌత్యం కొత్త శిఖరాలను తాకిందని, జీ20 సదస్సులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు 21వ శతాబ్దపు ప్రపంచం దిశను మార్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు.
Anand Mahindra Praises Araku Coffee: కాఫీ, టీ తోటలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అరకు. తాజాగా ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. అందులో మన దేశానికి వచ్చిన విదేశీ అతిధులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని బహుమతులు అందించింది. వాటి ద్వారా భారత్ కు ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మోడీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ బహుమతుల్లో తెలుగు వారు గర్వపడే అరకు కాఫీ కూడా ఉంది. ఇక…
G20 Summit: జీ20 సమ్మిట్ ముగిసింది.. కానీ ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జీ20 సమ్మిట్ సందర్భంగా చైనా ప్రతినిధుల మర్మమైన బ్యాగ్.. హోటల్ తాజ్ ప్లేస్‌లో కలకలం రేపింది. ఈ సందర్భంగా 12 గంటల పాటు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది.
జీ20కి సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ దేశానికి వెళ్లడానికి బయలుదేరగా ఆయన పాత విమానం మొరాయించిన విషయం తెలిసిందే. కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన మరో విమానాన్ని కూడా అనుకోని పరిస్థితుల్లో లండన్‌కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, ట్రూడో తిరుగు ప్రయాణం దాదాపు రెండు రోజుల పాటు వాయిదా పడుతుంది అనుకున్నారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేన విమానంలో ట్రూడోను స్వదేశానికి తరలిస్తామని భారత్ ప్రతిపాదించగా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు.…
Canada Prime Minister Justin Trudeau Jet Got Repaired: రెండు రోజులు జీ20 సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే తమ దేశాలకు చేరుకున్నారు. అయితే సమ్మిట్ ముగిసినప్పటికీ కెనడా ప్రధాని, ఆయన టీం ఇక్కడే ఉండిపోయింది. దీనికి కారణం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెళ్లాల్సిన విమానం రిపేర్ కదలకపోవడం. ట్రూడో బయలుదేరే ముందే ఆయన పాత విమానం మొరాయించింది.దీంతో ఆయనతో పాటు ఆయన వెంట వచ్చిన కెనడా…
G-20 Summit: భారతదేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు జీ20 సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో,ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా…
Britian Prime Minister RishiSunak Visited Akshardham Temple With His Wife Akshara Murty: జీ-20 సమావేశాల కోసం వివిధ దేశాల నేతలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సదస్సు కోసం భారత్ వచ్చిన వారిలో ఒకరైన బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ భారత్ ను పొగడ్తలతో ముంచెత్తిన విషయం విదితమే.ఆయన భారతదేశం ఎంతో గొప్పదని పేర్కొనడమే కాకుండా తనకు ఎంతో ఇష్టమైన దేశమని వెల్లడించారు. ఇక ఆయన బ్రిటన్ ప్రధాని అయిన…
African Union Becomes Permanent Member of G-20: ఈరోజు ఉదయం ప్రారంభమైన జీ-20 వన్ ఎర్త్ సెషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీ-20 సమ్మిట్ లో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. సబ్‌కా సాథ్ భావనతోనే ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని దానికి అందరూ అంగీకరిస్తారని భావిస్తూ ఈ ప్రకటన చేస్తున్నట్లు మోదీ తెలిపారు. జీ20…