G20 Summit: బ్యాగుతో జీ20కి చైనా ప్రతినిధి బృందం.. అందులో ఏముంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: జీ20 సమ్మిట్ ముగిసింది.. కానీ ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జీ20 సమ్మిట్ సందర్భంగా చైనా ప్రతినిధుల మర్మమైన బ్యాగ్.. హోటల్ తాజ్ ప్లేస్‌లో కలకలం రేపింది. ఈ సందర్భంగా 12 గంటల పాటు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. జీ20 సదస్సు కోసం భారతదేశానికి వచ్చిన చైనా ప్రతినిధి బృందానికి తాజ్ ప్యాలెస్ హోటల్‌లో ఆతిథ్యం ఇచ్చారు. బ్రెజిల్ ప్రతినిధి బృందం కూడా అక్కడ ఉంది. చైనీస్ ప్రతినిధి బృందంలోని సభ్యుని వద్ద ఒక విచిత్రమైన మర్మమైన బ్యాగ్ ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఆ బ్యాగ్‌ని హోటల్ సెక్యూరిటీ తనిఖీ చేయలేదు. బ్యాగ్‌లో వింతగా కనిపించే పరికరం గురించి హోటల్ సిబ్బంది ఢిల్లీ పోలీసులకు, ఇతర భద్రతా బలగాలకు సమాచారం అందించారు. చైనా ప్రతినిధుల బ్యాగులను స్కానర్‌లో పెట్టాలని భద్రతా బలగాలు అభ్యర్థించాయి.
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
బ్యాగ్‌ని తనిఖీ చేసేందుకు చైనా ప్రతినిధి బృందం నిరాకరించింది. దాదాపు 10 నుంచి 12 గంటల పాటు బ్యాగ్‌పై గొడవ జరిగింది. 12 గంటల పాటు అదే గది బయట భద్రతా బలగాలు మోహరించారు. జీ20 శిఖరాగ్ర సమావేశం ఆదివారం ముగిసింది. కొన్ని రోజుల తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. చాలా ప్రయత్నాల తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. సెప్టెంబరు 9-10 తేదీలలో జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రాలేదు. ఆయన స్థానంలో ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా భారత్ పలు దేశాలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో చైనా టెన్షన్ బాగా పెరిగింది. జీ-20 సదస్సులో భారత్ బలాన్ని చూసి చైనా చలించిపోయింది. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు గైర్హాజరు కావడంపై ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించారు. జిన్‌పింగ్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా నిరాశ వ్యక్తం చేశారు.
Read Also:Devara: రిలీజ్ డేట్ ని బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్…
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!