G-20 Summit: రెండోరోజు G20 సమావేశాలు.. వాటిపైనే చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G-20 Summit: భారతదేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు జీ20 సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో,ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌లతో పాటు పలువురు నేతలు మహాత్మ గాంధీకి నివాళులు అర్పించడానికి రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. వారందరికి ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. అనంతరం వారంతా రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
Also Read: Cyber Crime: నటికి టోకరా.. సెకన్లలో లక్ష నొక్కేశారు
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఇక ఈరోజు మధ్యాహ్నం మద్యాహ్నం 12:30 గంటల వరకు భారత మండపంలో ఒకే భవిష్యత్ అంశం పై చర్చలు జరగున్నాయి. ఇక జీ20 మొదటి రోజు సమావేశంలో జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఢిల్లీ డిక్లరేషన్ ను కూడా కూటమి దేశాలు అంగీకరించాయి. ఒకే భవిష్యత్ అంశం చర్చ తరువాత నేడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ తో ప్రధాని మోడీకి వర్కింగ్ లంచ్ ఉండనుంది. అనంతరం విడిగా కెనడా దేశాధినేతతో సమావేశం కానున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత వరుసగా కొమొరోస్, తుర్కియే (టర్కీ), యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక పలు కీలక అంశాలపై రంగాల వారీగా ఆయా దేశాలతో భారత్ పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాదికి జీ1 అధ్యక్ష బాధ్యతను భారత్ బ్రెజిల్ కు అప్పగించనుంది. ఆఫ్రికన్ యూనియన్ కు నిన్న జరిగిన సమావేశంలో శాశ్వత సభ్యత్వం ప్రకటించడంతో జీ20 సదస్సు ఇకపై జీ21 సదస్సు కానుంది. మొదటి జీ21 సదస్సుకు బ్రెజిల్ వేదిక కానుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!