Umesh Yadav: టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్‌కు షాక్ తగిలింది. స్నేహితుడి చేతిలో ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉమేష్ యాదవ్ టీమిండియాకు ఎంపికైన తర్వాత తన వ్యవహారాలను చూసుకునేందుకు తన స్నేహితుడు శైలేష్ ఠాక్రే(37)ను పర్సనల్ మేనేజర్‌గా అపాయింట్ చేసుకున్నాడు. శైలేష్‌తో తనకు ఎంతోకాలంగా స్నేహం ఉండటంతో ఉమేష్ ఇలా చేశాడు. అంతేకాకుండా ఉమేష్ తన స్నేహితుడికి ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణ కూడా అప్పగించాడు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు,…
ఈజీ మనీ కోసం కొందరు షాట్‌కట్స్ వెతుకుతుంటారు.. త్వరగా డబ్బులు సంపాదించాలి.. లక్షాధికారిని అయిపోవాలి.. కోటీశ్వరుడిగా పేరు తెచ్చుకోవాలి.. ఇలా ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు.. అయితే, వీరికంటే అడ్వాన్స్‌డ్‌గా సైబర్ నేరగాళ్లు ఉన్నారనే విషయాన్ని మర్చిపోతారు.. ఈజీగా వారి వలలో చిక్కుకుని ఉన్నకాడికి సమర్పించుకుంటారు.. తాజాగా, గుంటూరు జిల్లాలో కిడ్నీకి రూ.7 కోట్ల ఆఫర్ కలకలం సృష్టించింది.. ఆన్‌లైన్‌లో ఉన్న సమయంలో.. కిడ్నీ అమ్మితే భారీగా డబ్బులు వస్తాయనే ఓ లింక్ చూసిన ఇంటర్ విద్యార్థిని.. ఆ…
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. హీనంగా చూడకోయ్ దేన్నీ.. కవితామాయయేనోయ్ అన్నీ.. తలుపుగొళ్ల, హారతి పళ్లెం, గుర్రపు కళ్లెం.. కాదేదీ కవితకు కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు.. కేటుగాళ్లు.. ఇదే ఫాలో అవుతున్నారు.. కాకపోతే కవితలు కాదు.. మోసాలు.. బ్యాంకులు, వ్యాపారులకు, వ్యాపారులతో పేరుతో ప్రజలకు.. ఇలా చిన్నస్థాయి నుంచి.. పెద్ద స్థాయి వరకు ఎవరినీ వదలకుండా.. కోట్లకు కోట్లు లాగేస్తున్నారు. ప్రజల అవసరాలు, నమ్మకాలు, బలహీనతలే ఆసరాగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదన…
కొన్ని మోసాలు చూస్తుంటే.. ఎవరు అసలు..? ఎవరు నకిలీ ? అనేది కూడా అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది.. తాజాగా, ఓ వ్యక్తి కృష్ణాజిల్లా గన్నవరంలో సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. సబ్ కలెక్టర్ అవతారంలో అమాయక ప్రజల నుండి లక్షలు దండుకున్నాడు కేటుగాడు.. ఇలా అనేక మంది దగ్గర సుమారు 70 నుండి 80 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు ఫేక్ సబ్ కలెక్టర్ పిల్లా వెంకట రాజేంద్ర.. అయితే, కొంతకాలానికి మేం…
పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి అంటూ ఓ కేటుగాడు.. రూ.వందల కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. పంది పిల్లల వ్యాపారంలో పెట్టబడి పెట్టి 7 నెలల్లో 1.5 రెట్ల డబ్బును పొందండంటూ నమ్మబలికి పలువురిని మోసం చేశాడు.
హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల మోసాలు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా చిప్స్ అమర్చిన పెట్రోల్ బంక్ నిర్వాహకులు, ఈ ప్రత్యేక చిప్‌ల ద్వారా జనాలని మోసం చేస్తున్నారు.
మీరు చూస్తున్నది నిజమేనండి.. ఓ ఘరానా కేటుగాడు ఏకంగా నకిలీ బ్యాంకులనే ఏర్పాటు చేశాడు. ఉద్యోగులను నియమించుకుని బ్యాంకుకు ఏ మాత్రం తగ్గకుండా కార్యకలాపాలు చేపట్టాడు. ఖాతాలు తెరవడమే కాకుండా డిపాజిట్లు కూడా తీసుకున్నాడు. మొత్తం 9 బ్రాంచీలను తెరిచి దందా కొనసాగిస్తున్నాడు ఆ కేటుగాడు.