ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం చేసారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… అమాయక ప్రజలను ఆన్లైన్ బిజినెస్ పేరుతో టార్గెట్ చేసారు. చైనాకి చెందిన సైబర్ చీటర్స్ కి నకిలీ కంపెనీల పేరుతో కరెంట్ అకౌంట్స్ తీసి ఇచ్చారు హైదరాబాద్ వాసులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఓ వ్యక్తి. దాంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసాడు…
ఇటీవల హైదరాబాద్ నగరంలో మోసాలు పెరిగిపోతున్నాయి. అవసరాలను అవకాశంగా మలుచుకుని సొమ్ము చేసుకునే మాయగాళ్ల మాటలతో కొందరు మోసపోతున్నారు. తాజాగా నగరంలో ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ 15 మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి 5 కోట్లు వసూలు చేశాడు. 5 కోట్ల రూపాలయలు తీసుకుని ప్లాట్స్ ఇప్పించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. చాంద్రాయగుట్టలో…
ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్‌లో ఎరవేసి బాధితుల నుంచి అందినకాడికి దోచుకున్నారు కేటుగాళ్లు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫెస్బుక్ లో నకిలీ ఐడి క్రియేట్ చేసి టోకరా వేస్తున్నారు. తాజాగా విజయ్ రెడ్డి అనే నిరుద్యోగి.. ఐటీ ఉద్యోగం కోసం 8 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం ఆ కేటుగాడి మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఐపీ…
ఈ మధ్య ఆన్ లైన్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొందరు మోసగాళ్లు… బడా నాయకులను, ప్రముఖులను టార్గెట్ చేసి మరీ.. డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే.. తాజాగా కరోనా వ్యాక్సిన్లను అడ్డుపెట్టుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సీన్ లు ఉన్నాయని లక్ష రూపాయలు కొట్టేశాడు ఆ కేటుగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ కేటుగాడు తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్…
హైదరాబాద్ నగరంలో ఓ సైబర్ నేరగాడు రెండో పెళ్లి పేరుతో యాభై లక్షల రూపాయలను కాజేసాడు. భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీలో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రిజిస్టర్ చేసుకుంది. ఇటలీలో తాను డాక్టర్‌నని, ఇక్కడే క్లినిక్ ఉందని, మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ చూశానని ఆ మహిళను కేటుగాడు నమ్మించాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే స్థిరపడదామని ఆ మహిళను కేటుగాడు ముగ్గులోకి లాగాడు. ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులను…