ఉద్యోగం పేరు చెబితే ఎన్ని లక్షలైనా ఖర్చుచేయడానికి వెనుకాడని రోజులివి. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను సినిమాల్లో సైతం కామెడీగా చూపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పోలీసు కార్యాలయంలో హోమ్ గార్డు ఘరానా మోసం బయటపడింది. కరోనా కారణంగా నలుగురు హోంగార్డులు చనిపోయారు వారి పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని మీకే వచ్చేలా చూస్తానంటూ అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ..ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి లక్షల వసూలు చేశాడో హోం గార్డు.…
మిస్ట్ కాల్ వస్తే దానిని కట్ చేయడం మానేసి.. అవతలి గొంతు హస్కీగా వుందని మీరు దానికి టెంప్ట్ అయితే అంతే సంగతులు. ఆ స్వరం మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. మహిళా గొంతుతో లక్షల్లో అక్రమ సంపాదనకు తెరతీశాడో ప్రబుద్ధుడు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అక్రమ సంపాదన కోసం అడ్డదారి తొక్కాడు. ఆడ గొంతుతో మగాళ్లను బురిడీ కొట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మగాళ్లకు మిస్డ్ కాల్ చేయడం… వారితో ఆడ వారి లాగా మాట్లాడడం ఆర్థికంగా…
మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి…
కొంత మంది వ్యక్తులు నయా దందాలకు తెరలేపుతున్నారు. ఈజీగా మనీ సంపాదించుకునేందుకు పోలీసులు , మరికొందరు రవాణా శాఖాధికారులు , ఇంకొందరు విజిలెన్స్ , ఏసీబీ పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు గతంలోకూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి దందాలకు పాల్పడిన వారిలో కొందరు జైలు పాలయ్యారు కూడా. కానీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగకుండా దళారుల అవతారమెత్తుతున్నారు. బెదిరింపులు.. వసూళ్లు పట్టణాలు, నగరాల్లో మరో రకం దళారులు పుట్టుకొచ్చారు. ఎవరైనా ఇల్లు, లేదా అపార్టుమెంట్, లేదా…
గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు. రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్…
కాదేదీ మోసానికి అనర్హం. బ్యాంకుల పేరు చెప్పి.. ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేసేవారు ఒకరైతే ఓటీపీ నెంబర్లతో ఖాతాల్లో డబ్బులు కొల్లగొట్టేవారు మరికొందరు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలకు కూడా కేంద్రంగా మారుతోంది. కొంత మంది తెలివిగల వారు టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా నకిలీ ఫోన్ పే రంగంలోకి వచ్చింది. వస్తువు కొన్న తరువాత మీ అక్కౌంటులోకి డబ్బులు వచ్చినట్లే చూపిస్తాయి. కానీ డబ్బులు మాత్రం రావు..ఇది నకిలీ…
అవసరానికి అక్కరకు వస్తుందని బంగారాన్ని తాకట్టుపెడితే ఆ బంగారాన్ని కాజేశాడో బ్యాంక్ మేనేజర్. ఐఐఎఫ్ ఎల్ బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని మాయం చేశాడా మేనేజర్. క్రికెట్ బెట్టింగ్ కోసం పెద్ద మొత్తంలో పందెం కాశాడు మేనేజర్ రాజ్ కుమార్. తమ బ్యాంకులో తనఖా పెట్టిన 14.5 కిలోల బంగారాన్ని మాయం చేశాడు రాజ్ కుమార్. వన్ స్టార్ బెట్ యాప్ లో రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ కాశాడు. కోట్ల రూపాయల బెట్టింగ్ కి పాల్పడ్డ…
ఈరోజుల్లో పెళ్లి పేరుతో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా ముగ్గుర్ని పెళ్ళాడాడు ఆ ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లాలో ముగ్గుర్ని పెళ్ళాడిన నిత్య పెళ్ళికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యలు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడు. ఈ నిత్య పెళ్ళికోడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోట కు చెందిన మంజునాథ్ అంగళ్ళ కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా…
హైదరాబాద్ లో మరో చైనా కంపెనీ భారీ మోసం బయటపడింది. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ అధికారులు. హైదరాబాద్ కి చెందిన వారితో నకిలీ 12 కంపెనీలను సృష్టించి.. వాటి ద్వారా నకిలీ బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసాయి చైనీస్ కంపెనీలు. ఈ నకిలీ కంపెనీల ద్వారా అధిక లాభాల ఆశ చూపి.. పెట్టుబడుల పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు. ఇప్పటికే 2 కోట్ల 40 లక్షల రూపాయల మోసాలకు పాల్పడ్డ ఫెక్…