Fraud Case : తాజాగా నెల్లూరు జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న సంఘటన ఉదాంతం బయటకు వచ్చింది. విద్యుత్ శాఖలో లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తామని నెల్లూరు పట్టణంలోని 37 వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఇద్దరు వ్యక్తుల నుండి ఏకంగా రూ 9.3 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం ఇప్పించకుండా నేడు కనీసం సమాధానం కూడా చెప్పడం…
ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్, దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని…
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు తన ఇంట్లో సమస్యలను దూరం చేసుకోవాలనుకున్నాడు. పరిష్కారం కోసం ఒక తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. అయితే.. ఆ తాంత్రికుడు తన ఆస్తులన్నీ కాజేశాడు. దీంతో.. బాధితుడు ఆస్తులు, తన కుటుంబాన్ని రెండింటిని కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనలో బాధితుడు భార్య సుష్మా దేవదా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాంత్రికుడు, అతని కుమారుడు సహా నలుగురిపై కేసు పెట్టింది. ఈ వ్యవహారం 2023లో మొదలు కాగా.. పోలీసులు విచారణ చేపట్టారు.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. సుఖేశ్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో... సమన్లు ఇచ్చారు.
ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదించే ఆఫర్ వస్తే.. ఎవరు వదులుకుంటారు చెప్పండి? దీనికితోడు నిరుద్యోగ సమస్య ఒకటి. ఈ రెండింటిని (ఆశ, నిరుద్యోగం) ఆసరాగా తీసుకొని, ఓ ప్రైవేట్ కంపెనీ వందల మందికి కుచ్చటోపీ పెట్టింది. వారి వద్ద నుంచి కోట్లు దండుకొని, పత్తా లేకుండా మాయమైంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ సంస్థ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తమది యూఎస్ బేస్డ్ కంపెనీ అని,…