Fraud Case : తాజాగా హైదరాబాద్ లో మరో ఘరానా మోసం చవి చూసింది. అధిక లాభాలు ఆశ చూపి గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన చెప్పట్టారు. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 500 మందిని ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ మోసం చేసాడు. హబ్సిగూడా లో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసి రాజేష్ పరారైయ్యాడు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని రాజేష్ నమ్మించారు. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో 2 శాతం లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండు నెలల పాటు లాభాలను రాజేష్ చెల్లించాడు.
దాంతో నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో బాధితులు ఇన్వెస్ట్మెంట్ చేసారు. ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో తాజాగా రాజేష్ ఉడాయించాడు. గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను ఆదివారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసారు. తమకు న్యాయం చేయాలని సీసీఎస్ ముందు బాధితుల ఆందోళన చేసారు.
Health Tips : పెప్పర్ రైస్ ను తింటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి…