Fraud Case : తాజాగా నెల్లూరు జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్న సంఘటన ఉదాంతం బయటకు వచ్చింది. విద్యుత్ శాఖలో లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తామని నెల్లూరు పట్టణంలోని 37 వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఇద్దరు వ్యక్తుల నుండి ఏకంగా రూ 9.3 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం ఇప్పించకుండా నేడు కనీసం సమాధానం కూడా చెప్పడం లేదని పట్టణంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు యువకులు శనివారం ఫిర్యాదు చేశారు.
Kirrak Boys Vs Khiladi Girls :అనసూయ షోలో ఈ విప్పుకోవడాలు ఏంట్రా?
ఈ ఘటనలో భాగంగా వడ్డేపల్లి జగ్గారావు అనే వ్యక్తి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. నగరంలోని 37 వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ తమ వద్దనుండి ఒక్కొక్కరికి లైన్మెన్ ఉద్యోగం కోసం ఆరు లక్షల డిమాండ్ చేసినట్లు తెలిపారు. అందులో చాలా వరకు డబ్బులను తీసుకొని లైన్మెన్ ఉద్యోగం కోసం అడుగుతున్న అతని నుంచి ఎటువంటి సమాధానం రాలేకపోవడంతో.. తాము పోలీసులను ఆశించినట్లు ఆయన తెలిపారు. అయితే ఉద్యోగం ఏదని అడుగుతే తమని బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Miyapur: మియాపూర్ లో ప్రభుత్వ భూములు.. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు..