Bigg Boss Fake Call: సినిమా అనేది కలల ప్రపంచం. చాలా మంది ఆ ప్రపంచంలో ప్రయాణించాలని కోరుకుంటారు. అందుకోసం తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఎలాగైనా.. సినిమాల్లో, టీవీల్లో రాణించాలని తహతహలాడుతున్నారు. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతో మంది సెలబ్రిటీలను చేసింది. బిగ్ బాస్ వల్ల సినిమాల్లో, టీవీల్లో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. దీంతో బిగ్ బాస్ షో ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలా మంది యువత భావిస్తున్నారు. ఇదే బాటలో ఓ యువతి కూడా బిగ్ బాగ్ షోలో వెళ్లేందుకు ఆశ పడింది. బిగ్ బాస్ షోలో తనకు అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి దారుణంగా మోసపోయింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది.
ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న చౌదరి అలియాస్ స్వప్న టాలీవుడ్‌లో యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా మా టీవీలో ప్రొడక్షన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న సత్య ద్వారా బిగ్ బాస్ ఇన్‌ఛార్జ్ తమిళి రాజు పరిచయం అయ్యాడు. బిగ్ బాస్ లో వాడిన డ్రెస్ ప్రమోషన్ కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తమిళ్ రాజు ఆమెకు నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె గతేడాది జూన్ నుంచి అతడికి దాదాపు రెండున్నర లక్షలు చెల్లించింది. అవకాశం రాకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని తమిళ రాజు ఆమెకు హామీ ఇచ్చాడు.
దీనికి సంబంధించి తమిళ రాజు ఆమెకు అగ్రిమెంట్ కూడా రాశాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి మోసం చేస్తూనే వచ్చాడు. జూన్ అయిపోయింది.. చివరకు డిసెంబర్ కూడా ముగిసింది.. ఇక డబ్బు గురించి అడగ్గా రాజు వ్యవహారం మొత్తం బయటపడింది. డబ్బులు తన దగ్గర లేవని.. ఇచ్చే ప్రశక్తే లేదని తేల్చి చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను స్వప్న కొద్దిరోజుల క్రితం తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయినా దాని గురించి రాజు మౌనంగా ఉండటంతో నిన్న (శుక్రవారం) రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాజుపై సెక్షన్ 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Jogi Ramesh: ఎమ్మెల్యే పార్థసారథి vs జోగి రమేష్ మధ్య మాటల యుద్ధం..