ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు భూమి కింద నిధిని కనుగొన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాతావరణ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని రక్షించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుందని సైంటిస్టులు నమ్ముతున్నారు.
Tammy Hurricane: శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెంచ్ కరేబియన్ ద్వీపం గ్వాడెలోప్‌లో తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. హరికేన్ శనివారం పగటిపూట గ్వాడెలోప్ ద్వీపసమూహం సమీపంలో లేదా దాని మీదుగా వెళుతుందని అలానే దీని మార్గం రాత్రి సమయంలో సమీపంలోని సెయింట్-మార్టిన్ మరియు సెయింట్-బార్తెలెమీ దీవుల నుండి దూరం వెళ్లే అవకాశం ఉందని ఫ్రెంచ్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని కారణంగా భారీ వర్షపాతంతో పాటుగా బలమైన గాలులు వీస్తాయని సూచించింది. గంటకు 120 కిలోమీటర్లు…
France: ఫ్రాన్స్‌లో హై అలర్ట్ నెలకొంది. దాడులు జరుగుతాయనే బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్టైంది. పారిస్ సమీపంలోని 6 ఎయిర్ పోర్టులను అధికారులు ఖాళీ చేయించారు. లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాలను అత్యవసరంగా ఖాళీ చేయించారు. బుధవారం ఈమెయిల్ ద్వారా దాడి జరుగుతుందని ఓ అగాంతకుడు బెదిరింపులకు పాల్పడ్డారు.
France: ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్ స్కూల్ లో శుక్రవారం కత్తి దాడి జరిగింది. ఈ దాడిలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయుడు మరణించాడు. అయితే ఈ ఘటన ఫ్రాన్స్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. దాడి చేసిన వ్యక్తి మతపరమైన నినాదాలు చేస్తూ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 20 ఏళ్ల టీచర్ని దారుణంగా పొడిచి చంపాడు, మరో ఇద్దర్ని నిందితుడు గాయపరిచాడు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అనాగరికి…
France: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అయితే ఇరాన్ తో పాటు పలు ఇస్లామిక్ దేశాలు, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో హమాస్, పాలస్తీనాకు అనుకూలంగా పలువురు ర్యాలీలు చేస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లోని యూదులు, ఇజ్రాయిల్ మద్దతుదారులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి శుక్రవారం ఏకంగా ఇజ్రాయిల్ రాయబార సిబ్బందిపైనే కత్తితో దాడి చేశాడు.
France: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ని ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శించారు. ఈ సమయంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇది జరిగిన నెల తర్వాత మక్రాన్ ఈ ప్రకటన చేశారు.
France:యూరోపియన్ దేశం ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లౌకిక, ఉదారవాదానికి విలువనిచ్చే అక్కడి ప్రభుత్వం సంప్రదాయ ముస్లిం వస్త్రధారణపై నిషేధం విధించింది.
France Government Destroying Excess Wine: ఈ వార్త తెలుసుకుంటే మందు బాబుల గుండె పగిలిపోవచ్చు. ఎందుకంటే మందు బాటిల్ లో చుక్క వేస్ట్ అయినా మందుబాబులు అల్లాడిపోతుంటారు. అలాంటిది ఏకంగాా కొన్ని వేల లీటర్ల వైన్ ను కొని నాశనం చేయడానికి సిద్దపడింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఎవరైనా స్టాక్ ఎక్కువగా ఉంటే దానిని చౌకగా అమ్మేస్తారు. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం ఎక్కువ నిల్వ ఉన్న వైన్ ను నాశనం చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం…
ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ను పేల్చేందుకు బాంబు అమర్చామని దుండగులు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భద్రతా సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. సందర్శకులందరినీ బయటికి పంపించారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు, బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఇవాళ(శనివారం) యూఏఈకి వెళ్లారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకంతో పాటు మోడీ ఫోటోను ప్రదర్శించి గ్రాండ్‌గా వెల్ కమ్ పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.