France: ఇజ్రాయిల్-హమాస్ ఘర్షణ వేళ.. ఫ్రాన్స్ స్కూల్‌లో కత్తితో దాడి.. ఉగ్రచర్యగా అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధం తీవ్రంగా సాగుతోంది. అయితే ఇరాన్ తో పాటు పలు ఇస్లామిక్ దేశాలు, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో హమాస్, పాలస్తీనాకు అనుకూలంగా పలువురు ర్యాలీలు చేస్తున్నారు. దీంతో ఆయా దేశాల్లోని యూదులు, ఇజ్రాయిల్ మద్దతుదారులు ఒకింత భయాందోళనకు గురవుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి శుక్రవారం ఏకంగా ఇజ్రాయిల్ రాయబార సిబ్బందిపైనే కత్తితో దాడి చేశాడు.
ఇదిలా ఉంటే ఫ్రాన్స్ లోని ఉత్తర ప్రాంతంలో అరాస్‌లోని ఓ స్కూల్ లో శుక్రవారం కత్తితో ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో టీచర్ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అయితే ఇది ఉగ్రవాద దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. అనుమానిత వ్యక్తిని రష్యాలోని జన్మించిన చెచెన్‌గా, లైసీ గంబెట్టా హై స్కూల్ పూర్వ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. అయితే అతడు రాడికల్ ఇస్లామిక్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
Read Also: Supreme Court: ఐన్‌స్టీన్ E = mc²ని సవాల్ చేస్తూ పిల్.. సుప్రీంకోర్టు రియాక్షన్ ఇదే..
అయితే దాడి సమయంలో అతను ‘‘అల్లాహు అక్బర్’’ అంటూ నినాదాలు చేశారని అక్కడి స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయితే పోలీసులు దీన్ని ఇంకా ధృవీకరించలేదు. నిందితుడి వయసు 20 ఏళ్లుగా గుర్తించారు. కత్తి దాడిలో చనిపోయిన వ్యక్తిని ఫ్రెంచ్ భాషా ఉపాద్యాయుడిగా గుర్తించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు అరాస్ వెళ్తున్నట్లు అతని కార్యాలయం ప్రకటించింది.
అయితే ఈ దాడిలో ఇజ్రాయిల్-హమాస్ ప్రమేయాన్ని ఇంకా గుర్తించలేదు. ఇటీవల కాలంలో ఫ్రాన్స్ లో రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడుతున్నాయి. అక్కడ సాధారణ ప్రజాజీవితానికి భంగం కలిగిస్తున్నాయి. ఇదిలా పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్ లో ఆందోళనలు జరిగాయి. మక్రాన్ సర్కారు ఈ ర్యాలీలపై నిషేధం విధించింది. గత శనివారం హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 13 మంది ఫ్రెంచ్ దేశస్తులు చనిపోగా, 17 మంది ఆచూకీ లభించలేదు.
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..