France: ఫ్రాన్స్ హై అలర్ట్.. ఇజ్రాయిల్-పాలెస్తీనా యుద్ధం నేపథ్యంలో ఉగ్రదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France: ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్ స్కూల్ లో శుక్రవారం కత్తి దాడి జరిగింది. ఈ దాడిలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయుడు మరణించాడు. అయితే ఈ ఘటన ఫ్రాన్స్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. దాడి చేసిన వ్యక్తి మతపరమైన నినాదాలు చేస్తూ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 20 ఏళ్ల టీచర్ని దారుణంగా పొడిచి చంపాడు, మరో ఇద్దర్ని నిందితుడు గాయపరిచాడు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అనాగరికి ఇస్లామిక్ ఉగ్రవాదం’ అంటూ దాడిని ఖండించారు.
Read Also: Israel-Hamas: హమాస్‌కి గట్టి ఎదురుదెబ్బ.. కీలక ఉగ్రనేతను లేపేసిన ఇజ్రాయిల్..
Also Read
ఫ్రాన్స్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డర్మానిన్ మాట్లడుతూ.. ఫ్రాన్స్ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నామని, ఈ దాడికి ఇజ్రాయిల్-పాలెస్తీనా యుద్ధంతో లింక్ ఉందని వెల్లడించారు. ఈ దాడికి ముందు మక్రాన్ మాట్లాడుతూ.. ఫ్రెంచ్ వారు ఐక్యంగా ఉండాలని, ఇజ్రాయిల్- హమాస్ సంఘర్షణను ఇంటికి తీసుకురావడం మానుకోవాలని ప్రజలకు సూచించారు. పాలెస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్ లో ర్యాలీలను మక్రాన్ ప్రభుత్వం నిషేధించింది. ఇది జరిగిన తర్వాతి రోజే టీచర్ డొమినిక్ బెర్నార్డ్ హత్య చేయబడ్డాడు. దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన మక్రాన్, టీచర్‌కి నివాళులు అర్పించారు.
దాడికి పాల్పడిన వ్యక్తిని మహ్మద్ ఎం. అని గుర్తించారు. ఇతను అదే స్కూల్ లో పూర్వ విద్యార్థి. ఇతనికి రాడికల్ ఇస్లామిక్ శక్తులకు సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. నిందితుడు రష్యాలో పుట్టిన చెచెన్ మూలాలు ఉన్న వ్యక్తి. ఇటీవల కాలంలో ఫ్రాన్స్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడుతున్నాయి. 2015లో పారిస్ లో ముష్కరులు ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ తరువాత 2020లో మహ్మద్ ప్రవక్తను ఎగతాళి చేస్తూ కార్టూన్ వేశారని, ప్రతీకారం తీర్చుకునేందుకు శ్యామూల్ పాటీ అనే టీచర్ ని చెచెన్ యువకుడు తల నరికి చంపాడు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!