Emmanuel Macron: భారతదేశం, ఫ్రాన్స్ మధ్య స్నేహం నిరంతరం బలపడుతోంది. 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌తో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Tata-Airbus: భారత గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మక్రాన్ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జైపూర్ నగరంలో ఆయనను ఆప్యాయంగా ఆహ్వానించారు.
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల విద్యా శాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్‌ను మంగళవారం తన కొత్త ప్రధాన మంత్రిగా నియమించారు. దేశ ప్రధాని పోస్టుకు తొలిసారిగా గే (స్వలింగ సంపర్కుడు) వర్గానికి చెందిన 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ పేరును మంగళవారం ప్రతిపాదించారు.
Human Trafficking : మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న రొమేనియా విమానం భారత్‌కు చేరుకుంది. ఈ విమానంలో 276 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రపంచమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయింది. సెమి క్రిస్మస్ అంటూ నెల రోజులు ముందు నుంచే సెల్రబేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో అపశ్రుతి చోటుచేసుకుంది. విందు వికటించి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. పశ్చిమ ఫ్రాన్స్ లోని మోంటోయిర్ డి బ్రిటేన్‌లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు డిసెంబర్ 24న క్రిస్మస్ పార్టీ ఏర్పాటు…
France: మానవ అక్రమ రవాణా అనుమానంతో దుబాయ్ నుంచి 303 మంది భారతీయులతో సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం భారతీయులను ఫ్రాన్స్ నుంచి పంపించేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ఈ రోజు అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది.
France: 300 మందికి పైగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు ఆదేశంలో నిలిపేసినట్లు శుక్రవారం తెలిపారు. ప్రయాణికులను తీసుకెళ్తున్న విమానం ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో విమానాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రహస్య సమాచారం రావడంతో ఈ విమానాన్ని అధికారులు అడ్డుకున్నారు. యూఏఈ నుంచి ఈ విమానం బయలుదేరింది. దక్షిణ అమెరికాలోని నికరాగ్వాకి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
Baby Growing In Bowel: ఫ్రాన్స్ దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. మహిళ పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లతో పాటు నిజం తెలిసి సదరు మహిళ కూడా ఒక్కసారిగా కంగుతింది. 37 ఏళ్ల మహిళ తనకు తెలియకుండానే 23 వారాల గర్భవతి అని తేలింది. అయితే బిడ్డ పేగులో పెరుగుతున్నాడనే వార్త తెలిసి అంతా షాక్‌కి గురయ్యారు.
France: ఫ్రాన్స్‌తో పాటు బెల్జియం, ఇతర యూరోపియన్ దేశాల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరుగుతోంది. పలువురు ఆయా దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే 2020లో ఫ్రెంచ్ ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీని తల నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో ఆరుగురు టీనేజర్లను ఫ్రెంచ్ కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది.