France: ఇది తెలిస్తే మందుబాబుల గుండె పగిలిపోతుంది.. ఆల్కహాల్ ను కొని నాశనం చేస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France Government Destroying Excess Wine: ఈ వార్త తెలుసుకుంటే మందు బాబుల గుండె పగిలిపోవచ్చు. ఎందుకంటే మందు బాటిల్ లో చుక్క వేస్ట్ అయినా మందుబాబులు అల్లాడిపోతుంటారు. అలాంటిది ఏకంగాా కొన్ని వేల లీటర్ల వైన్ ను కొని నాశనం చేయడానికి సిద్దపడింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఎవరైనా స్టాక్ ఎక్కువగా ఉంటే దానిని చౌకగా అమ్మేస్తారు. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం ఎక్కువ నిల్వ ఉన్న వైన్ ను నాశనం చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఏకంగా 200 మిలియన్ల యూరోలను ఖర్చు చేస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు అది రూ.1700 కోట్లకు సమానం. ఇంత ఖర్చు పెట్టి మరీ ఫ్రాన్స్ వైన్ ను నాశనం చేస్తుంది. ఫ్రాన్స్ లో ఇంత మొత్తంలో వైన్ పేరుకుపోవడానికి కారణముంది.
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం,ద్రవ్యోల్బణం, కొవిడ్ ప్రభావం, ఆహారం, ఇంధన ధరలు పెరిగిపోవడంతో.. ఫ్రాన్స్ ప్రజలు తమ ఖర్చులను గణనీయంగా తగ్గించుకున్నారు. ముఖ్యంగా.. వైన్ వంటి చెడు అలవాట్లకు డబ్బు వేస్ట్ చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎందుకంటే తాగితే కేవలం మందుకు మాత్రమే కాకుండా తరువాత ఆరోగ్యం చెడిపోయి కూడా వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. అందుకే ఫ్రాన్స్ ప్రజలు అల్కహాల్ వినియోగాన్ని బాగా తగ్గించేశారు. దీనికి బదులు నాన్-ఆల్కహాలిక్, క్రాఫ్టెడ్ బీర్ వంటి ఇతర రకాల లిక్విడ్ డ్రింక్స్ వాడుతున్నారు. దీంతో వాటికి ఆ దేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ఈ కారణంగా వైన్ దిగ్గజాలైన బోర్డాక్స్, లాంగ్యూడాక్ సంస్థల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. వాటి వద్ద నిల్వలు భారీగా పేరుకుపోయాయి. భారీగా నష్టపోయిన ఆ సంస్థలను ఆదుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆ వైన్ ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. అయితే వాటిని కొన్న ప్రభుత్వం వాటిని తక్కువ ధరకు విక్రయిస్తుంది అనుకుంటే వైన్ డిమాండ్ ను పెంచడం కోసం కొన్ని మొత్తానికి నాశనం చేయాలని డిసైడయ్యింది. దాదాపు రూ.1700 కోట్లు పెట్టి కొన్ని వైన్ ను ఇలా చేస్తుంటే మందు బాబులు అల్లాడిపోతున్నారు. ఎందుకు సామి వేస్ట్ చేయడం మాకు ఇవ్వచ్చు కదా అని అనకుంటున్నారు. ఒక విధంగా ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!