కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడికి మరో రైతు బలైపోయాడు. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య అనే రైతు వ్యవసాయ పనుల కోసం పంట పొలంలోని కరెంటు మోటార్ వేయడానికి ఇవాళ (గురువారం) ఉదయం వెళ్లే క్రమంలో ఏనుగు ఒక్క సారిగా దాడి చేయడంతో.. పోచయ్య అక్కడికక్కడే మృతి చెందారు.
తిరుమల నడకదారిలో మరో సారి చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత ఏడాది తిరుమల కాలి నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు అలర్ట్ అయ్యారు.
విశాఖపట్నం నగరంలోని నడిబొడ్డున చిరుత పులి చర్మాన్ని రవాణా చేస్తున్న కొందరు కేటుగాళ్లను పోలీస్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ( DRI ) వర్గాలకు అందిన సమాచారం మేరకు మంగళవారం నాడు సాయంత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు.
అడవుల్లో వుండాల్సిన వన్యప్రాణులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు రోడ్లమీదకు, జనం మీదకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రక్కన నున్న అపార్టుమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాసేపు చక్కర్లు కొట్టింది. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందారు. కాసేపు ఆ ప్రాంతంలో తచ్చాడిన ఆడిన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మరణించడం, మరొకరు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. అడవి జంతువుల వేట వారి పాలిట మృత్యువు గా దాపురించింది. అడవి జంతువుల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందగా, ఆ మృతదేహం రెండు రోజులు అయినప్పటికీ లభించలేదు. పోలీసుల వేధింపులకు భయపడి మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. గత రెండు రోజుల నుంచి పోలీసులు…
చిత్తూరు జిల్లాలో గజరాజులు బీభత్సం కలిగిస్తున్నాయి. రేణిగుంటలో ఏనుగుల బీభత్సంతో జనం హడలిపోతున్నారు. మొలగముడి గ్రామంలో 3 ఏనుగులు సంచారంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. పంట పొలాలపై వీరంగం సృష్టిస్తున్నాయి. చెరకు పంట నాశనం చేశాయి గుంపులుగా వచ్చిన ఏనుగులు. దీంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. రాత్రి సమయాల్లో రైతులు పంటలకు కాపలా వుంటుంటారు. అయితే ఏనుగులు ఏ వైపు నుంచి వచ్చి తమపై దాడిచేస్తాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు అన్నదాతలు, రైతులు ఆరుగాలం…