Ford to cut up to 3,200 jobs: అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఐటీ పరిశ్రమపైనే కాకుండా.. ఆటోమోబైల్ పరిశ్రమపై కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గ్లోబర్ ఆటోమోబైల్ దిగ్గజం జర్మనీకి చెందిన ఫోర్డ్ 3200 మందిని ఉద్యోగాల నుంచి తొలగించబోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మెటీరియల్స్ కోసం పెరుగుతున్న ఖర్చులు, ఆర్థికమాంద్యం భయాలతో ఇతర ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యూరప్ ప్రాంతంలోనే ఉద్యోగాలు పోనున్నాయి.
ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహానాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. టెస్లా కార్లు భారీ ఆదరణను పొందుతున్నాయి. టెస్లాకు భారీ ఆదరణ రావడంతో టాప్ కంపెనీగా అవతరించింది. అయితే, అమెరికా కన్సూమర్ రిపోర్ట్స్ 2022 ప్రకారం అత్యుత్తమ కార్లలో ఫోర్ట్ ముస్టంగ్ మాక్ ఈ అనే కారు అగ్రస్థానంలో నిలిచింది. గత రెండేళ్లుగా టెస్లా మోడల్ 3 కారు ప్రపంచంలో టాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ఏడాది మోడల్ 3 కారును ఫోర్డ్ ముస్టంగ్ మాక్…