ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహానాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్నది. టెస్లా కార్లు భారీ ఆదరణను పొందుతున్నాయి. టెస్లాకు భారీ ఆదరణ రావడంతో టాప్ కంపెనీగా అవతరించింది. అయితే, అమెరికా కన్సూమర్ రిపోర్ట్స్ 2022 ప్రకారం అత్యుత్తమ కార్లలో ఫోర్ట్ ముస్టంగ్ మాక్ ఈ అనే కారు అగ్రస్థానంలో నిలిచింది. గత రెండేళ్లుగా టెస్లా మోడల్ 3 కారు ప్రపంచంలో టాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ఏడాది మోడల్ 3 కారును ఫోర్డ్ ముస్టంగ్ మాక్ ఈ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్ యూవీ ట్రక్కులను హైలైట్ చేస్తున్నది. టెస్లా మోడల్ 3 కి పోటీగా వచ్చిన ముస్టాంగ్ మ్యాక్ ఈ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్లా మ్యాక్ కారు పికప్ ట్రక్ మోడల్‌గా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది దీనిని కోనుగోలు చేయడం మొదలుపెట్టారు. టెస్లా మోడల్ 3 కారు ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 423 కిమీ పరుగులు తీస్తుంది. అదే ముస్టాంగ్ మాక్ ఈ పూర్తి స్థాయిలో ఛార్జ్ చేస్తే 600 కిమీ మేర ప్రయాణిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read: Cm Kcr Mumbai Tour: కేసీఆర్‌కు ముంబైలో ఘన స్వాగతం