Millions In Britain Skipping Meals To Tackle Cost-Of-Living Crisis: యునైటెడ్ కింగ్ డమ్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు బ్రిటన్ వాసులు భోజనాలను తగ్గించుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో యూకేలో ద్రవ్యోల్భనం 10 శాతాని కన్నా ఎక్కువ అయింది. దీంతో…
శ్రీలంక పరిస్థితి ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయింది. నిత్యావసరాల కోసం కొనేందుకు జనాల దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దేశ ఖజానా మొత్తం పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం శ్రీలంక విదేశాల ఇచ్చే సాయంపైనే ఆధారపడింది. ప్రజల ఆగ్రహావేశాల మధ్య గతంలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో ఆహార సంక్షోభాన్ని హెచ్చరిస్తూ కీలక…
ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఖజానాలో విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. అయితే దేశంలో ఆహార సంక్షోభం మరింత పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు వరిని సాగు చేయాలని ప్రభుత్వం వేడుకుంటోంది. ఇప్పటికే ఆహార సంక్షోభం తీవ్రంగా ఉందని.. మరో 50 శాతం ఉత్పత్తి తగ్గితే శ్రీలంక పరిస్థితులు మరింత తీవ్ర పరిస్థితులకు దారి…
ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్…
కరోనా కారణంగా మార్చి 2020 నుంచి ఉత్తర కొరియా తన సరిహద్దులను మూసివేసింది. దీంతో చైనాతో వాణిస్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఉత్తర కొరియాలోకి కరోనా మహమ్మారి ఎంటర్ కాలేదు. రెండేళ్లుగా ఆ దేశంలోని ప్రజలు ఆహారం కొరతతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్షుడు కిమ్ అనుసరిస్తున్న విధానాలు, అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగాల కారణంగా ప్రపంచదేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కరోనా, అంతర్జాతీయ ఆంక్షలతో ఉత్తర కొరియా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరిహద్దులు మూసివేయడంతో చైనా, రష్యా నుంచి దిగుమతులు ఆగిపోయాయి. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రస్థాయికి చేరుకున్నది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తగినంతగా లేకపోవడంతో కొరత పెరిగిపోతున్నది. దేశ రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజల రక్షణ, ఆహార ఉత్పత్తికి ఇవ్వలేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇక, నార్త్ కొరియాలో ఆహార సమస్య తీవ్రంగా ఉందని ఐరాస మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చింది. ఈ…
ఆఫ్ఘన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయిన తరువాత తాలిబన్ల పాలనలోకి వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో అధికారుల బదలాయింపు ప్రక్రియ పూర్తికాలేదు. అధికార బదలాయింపు పూర్తికాకుండానే అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లే ఇందుకు కారణం. ఆఫ్ఘన్‌లో భద్రత ఏ స్థాయిలో ఉన్నదో నిన్నటి సంఘటనతో తేలిపోయింది. తాలిబన్లకు పాలన అప్పగిస్తే ఐసిస్, అల్‌ఖైదా వంటి అంతర్జాతీయ నిషేదిత ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత యుద్దాలతో,…