Millions In Britain Skipping Meals To Tackle Cost-Of-Living Crisis: యునైటెడ్ కింగ్ డమ్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. లిజ్ ట్రస్ ప్రధాని అయిన తర్వాత అక్కడ విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయడంతో రానున్న కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు. ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు బ్రిటన్ వాసులు భోజనాలను తగ్గించుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో యూకేలో ద్రవ్యోల్భనం 10 శాతాని కన్నా ఎక్కువ అయింది. దీంతో విపరీతంగా ఆహారధరలు పెరిగాయి.
యూకే వాసుల్లో సగం మంది భోజనాల సంఖ్యను తగ్గించుకున్నారని కన్జూమర్ గ్రూప్ విజ్ పేర్కొంది. 3000 మందిపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంక్షోభం ముందుతో పోలిస్తే ప్రజలు తినడం చాలా తక్కువ అయింది. 80 శాతం మంది ప్రజలు ఆర్థికంగా కష్టపడుతున్నారు. యూకే ప్రభుత్వం ఇంధన ధరలను ఫ్రీజ్ చేయడంతో మిలియన్ల మంది ప్రజలు కనీసం తమ ఇళ్లను వేడి చేసుకోలేకపోతున్నారని సర్వే వెల్లడించింది.
Read Also: Maharashtra: చంద్రపూర్ జిల్లాలో పులి బీభత్సం.. ఇద్దరు పశువుల కాపర్లపై దాడి.
యూకేతో పాటు చాలా యూరోపియన్ దేశాలు ఆర్థికంగా కుదేలు అవుతున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యూరోపియన్ దేశాల్లో తీవ్ర ఇంధన సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. రానున్నది శీతాకాలం కావడంతో యూరప్ వాసులు ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారో చూడాలి. మరోవైపు ఇటీవల లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకువచ్చని బడ్జెట్ వివాదానికి కారణం అయింది. పన్నుల కోత వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. దీంతో అప్పటి వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న క్వాజీ కార్టెంగ్ ను పదవి నుంచి తప్పించి జెరెమీ హంట్ ను ఆర్థిక మంత్రిగా నియమించారు ప్రధాని లిజ్ ట్రస్. తీవ్ర ఆర్థిక సంక్షోభం ముంగిట ఉన్న బ్రిటన్ వృద్ధి రేటు కూడా క్షీణిస్తుందని ఐఎంఎఫ్ ప్రిడిక్షన్స్ చెబుతున్నాయి. 2023లో బ్రిటన్ వృద్ధి రేటు 5 కన్నా దిగువనే ఉంటుందని వెల్లడించింది.