వరద బాధితులకు వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విరాళం ప్రకటించారు.. తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు వైసీపీ ప్రజాప్రతినిధులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ చేపడుతున్న సహాయ కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
Flood Victims in Vijayawada: బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వరద బాధితులు కంపెనీలకు భారీగా చేరుకుంటున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల నుంచి క్లెయిమ్ కోసం బాధితులు వస్తున్నారని ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు మాట్లాడుతూ.. వరదల్లో పాడైన వాహనాల ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేసిన 12 రోజుల్లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం చెబుతోంది అన్నారు.
వరద బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు బెజవాడ పోలీసులు.. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయం, విజయవాడ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు..
Vijayawada Floods: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు.
Flood Victims Leving: బెజవాడ నగరం ఖాళీ అవుతుంది. బెజవాడ ముంపు ప్రాంతాల నుంచి బయట ప్రాంతాలకు వేలాది మంది తరలి వెళ్తున్నారు. నీటి ఉదృతి తగ్గటంతో కట్టు బట్టలతో ఇళ్లను వదిలి పెట్టీ వెళ్లిపోతున్నారు. విద్యుత్ సరఫరా, తాగు నీరు, ఫుడ్ అందక ఇళ్లను వదిలి వెళ్తున్నట్టు బాధితులు చెబుతున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. వారికి అందుతున్న సాయంపై ఆరా తీసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు.. పార్టీ నాయకుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్.
వరద బాధితులను ఆదుకనేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని కోరారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశామన్నారు.. ఇక, ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్ కు అప్పగించారు.. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం..
విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
వరద బాధితులకు ఆహార పంపిణీ కోసం రంగంలోకి దిగాయి హెలికాఫ్టర్లు. ప్రస్తుతం రెండు హెలికాఫ్టర్ల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం అందిస్తున్నాయి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు.. ఇప్పటి వరకు 3 టన్నులకు పైగా ఆహారం, నీళ్లు బాధితులకు అందజేశారు.. బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, బ్రెడ్, ఫ్రూట్ జ్యూస్, టెట్రాప్యాక్స్, ఇతర ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు.