బుధవారం రాత్రి నుంచి రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య అధికారికంగా యుద్ధం మొదలైంది. సైనిక చర్య అని రష్యా చెబుతున్నా, సైనిక చర్య కాదని, పూర్తి స్థాయిలో రష్యా యుద్ధానికి దిగిందని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అమెరికా, యూరప్ దేశాలు, బ్రిటన్ రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యా బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేసింది. దీంతో ఆ దేశానికి బ్రిటన్ నుంచి ఎలాంటి నిధులు అందవు. బ్రిటన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా, బ్రిటన్ విమానాలపై ఆంక్షలు…
రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.. వీటి ప్రభావం స్టాక్‌మార్కెట్లపై కూడా పడిన విషయం తెలిసిందే కాగా… రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం.. దీనిపై భారత విదేశాంగశాక ఓ ప్రకటన విడుదల చేసింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, భారత్-ఉక్రెయిన్ మధ్య…
ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. రష్యాకు సమీపంలో ఉన్న బెలారస్‌లో రష్యా సైన్యాన్ని భారీగా మోహరిస్తున్నది. మరోవైపు రష్యా సముద్రజలాల్లో లైవ్ వార్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నది. రష్యా, అమెరికా మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. పుతిన్, జో బైడెన్‌లు అనేకమార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని జో బైడెన్ పుతిన్‌కు చెప్పినట్టు సమాచారం. Read: Medaram Jathara: సమ్మక్క సారక్క జాతర గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి… తాము…
పండుగల సీజన్ వచ్చేస్తోంది.. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది.. పనిలో పనిగా అందినంత దండుకునే పనిలో పడిపోయాయి రవాణా సంస్థలు.. రద్దీ పెరిగిందంటే చాలు.. అదనపు వడ్డింపులు తప్పవనే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ రద్దీతో విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయాయి.. తమిళనాడులోని చెన్నై నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా వెళ్లే విమాన సర్వీసులపై ఆయా విమాన సంస్థలు…
కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది. అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఐ పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు.…
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోకి వచ్చే ప్రమాదమున్నందున ప్రభావిత దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ మహమ్మారితో ఏడాదిన్నరపాటు పోరాడామని, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్‌తో సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు విమాన రాకపోకలను నిలిపేశాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన…
సింగపూర్ మరియు మలేషియాతో విమానయాన సేవలను అందించే తాత్కాలిక ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందాన్నిప్రారంభించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రం నుండి ఈ దక్షిణాదికి తమిళనాడు ఇతర ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. తూర్పు ఆసియా దేశాలైన సింగపూర్, మలేషియాల్లో శాశ్వత నివాసం ఉంటున్న పలువురు తమిళులు ప్రత్యక్ష విమానాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం…
కరోనా మహమ్మారి నేపథ్యంలో స్థంభించిన అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఈ ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ విమానప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెల్సిందే.. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో వివిధ దేశాలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రూట్లలో 33 శాతం…
ఇండియా పాక్ మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో రెచ్చిపోతున్నారు. విధ్వంసాలు సృష్టిస్తున్నారు. పుల్వామా ఘటన తరువాత రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. గతంలో ఇండియా రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇండియా విమానాలు ఇతర దేశాల మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు కాశ్మీర్ నుంచి షార్జాకు వెళ్లే విమానాలకు కూడా పాక్ అనుమతులు ఇవ్వలేదు. Read: వైరల్:…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మరలా విరుచుకుపడుతున్నది. కరోనాకు భయపడి చాలా దేశాలు సరిహద్దులను మూసివేశాయి. విమాన సర్వీసులు నిలిపివేశాయి. జాతీయంగా షరతులతో కూడిన విమానాలను కొంతకాలం పాటు నడిపారు. రష్యాతో పాటుగా కొన్ని దేశాల్లో కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉన్నది. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలోని కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టింది. 18 నెలలుగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రస్తుతం తిరిగి పునరుద్దరించింది. రెండు డోసుల…