బుధవారం రాత్రి నుంచి రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య అధికారికంగా యుద్ధం మొదలైంది. సైనిక చర్య అని రష్యా చెబుతున్నా, సైనిక చర్య కాదని, పూర్తి స్థాయిలో రష్యా యుద్ధానికి దిగిందని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. అమెరికా, యూరప్ దేశాలు, బ్రిటన్ రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యా బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేసింది. దీంతో ఆ దేశానికి బ్రిటన్ నుంచి ఎలాంటి నిధులు అందవు. బ్రిటన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా, బ్రిటన్ విమానాలపై ఆంక్షలు విధించింది. యూకే విమానాలు రష్యా గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. ఇది బ్రిటన్‌కు పెద్ద దెబ్బ అని చెప్పాలి. రష్యా ఈ నిషేధం విధిస్తే దాని వలన బ్రిటన్ విమానాలు భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా యూకే ఆంక్షలు విధించడంతో, దానికి బదులుగా రష్యా ఈ విధమైన నిర్ణయం నిర్ణయం తీసుకున్నది.
Read: Ukraine Crisis: రాజధాని కీవ్‌కు చేరువలో రష్యా సైన్యం… ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సైన్యం…