Flights Cancelled: తీరం వైపు దూసుకు వస్తుంది మొంథా తుఫాన్.. ఇప్పటికే తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారిపోయాయి.. మరోవైపు, అప్రమత్తమైన రైల్వే శాఖ.. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధితో పాటు.. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కూడా పలు రైలు సర్వీసులను మూడు రోజుల పాటు రద్దు చేసింది.. ఇక, మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన విమానయాన శాఖ.. మొంథా తుఫాను నేపథ్యంలో రేపు పలు విమానాలు విజయవాడ నుంచి రద్దు చేసినట్టు ప్రకటించారు.. Read Also:…
Flight On Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు ఉదయం వరకు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది.
Iran- Israel Conflict: ఇరాన్‌పై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమాన్ నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం (అక్టోబర్7) ఉదయం 6 గంటల దాకా దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసింది.
సోమవారం తెల్లవారుజామున ముంబై.. శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలపై భారీగా నీరు నిలిచింది. భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు.. భారీ వర్షం దృష్ట్యా కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా, ముంబై విమానాశ్రయంలో 27 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. నగరంలో తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు శాఖ అధికారులు తెలిపారు.
Sicily travel alert: యూరప్‌లోని అతిపెద్ద యాక్టివ్ అగ్ని పర్వతం అయిన మౌంట్ ఎట్నా శుక్రవారం విస్ఫోటనం చెందింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా ఆగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు.