పశ్చిమ బెంగాల్లో రెమల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ తుఫాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. రెమల్ తుఫాను నేపథ్యంలో గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లే 14 విమానాలను రద్దు చేసింది. తుఫాను కారణంగా పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు రద్దు చేసినట్లు గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
విస్తారా విమాన సంస్థ కీలకం నిర్ణయం తీసుకుంది. ఫైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల కారణంగా విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు విస్తారా ఎయిర్ లైన్స్ ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో.. 194 విమానాలు, 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది ఈ సీజన్ లో కనిష్ట ఉష్ణోగ్రత. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం ప్రాంతంలో విజిబిలిటీ జీరో మీటర్లుగా ఉంది. కాగా.. ఢిల్లీ విమానాశ్రయం గత రాత్రి పొగమంచు హెచ్చరికను జారీ చేసింది. ప్రయాణీకులు విమానాల గురించి తాజా…
భారత్- మాల్దీవుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో లక్షద్వీప్‌ను సందర్శించాలని భావిస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్.. లక్షద్వీప్‌కు నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్ అదనపు విమానాలను ప్రారంభించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డంకిగా మారింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్ కావడం లేదు.. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.
జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయం ఇరాన్ నుంచి వచ్చిన విమానానికి బెదిరింపు రావడంతో సోమవారం అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను నిలిపివేసింది. కొన్ని గంటల తర్వాత బెదిరింపుకు ప్రతిస్పందనగా పోలీసు ఆపరేషన్ తర్వాత ఎయిర్‌పోర్టు తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య.. ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ కు వెళ్లే తన విమానాలను రద్దు చేసింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రత కోసం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుండి వెళ్లే ఎయిరిండియా విమానాలను అక్టోబర్ 14 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
యునైటెడ్ కింగ్డమ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక సమస్యతో పోరాడుతోంది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.