IndiGo Flight makes Emergency Landing in Patna due to Engine Fail: దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన ఓ విమానంకు పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం పట్నా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంజిన్ వైఫల్యం కారణంగానే.. విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే అత్యవసరంగా దించేశారు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న వారు పెను ప్రమాదం…
ధోని నిద్రపోతున్న వీడియోనూ తానే స్వయంగా షూట్ చేసిన ఎయిర్ హోస్టెస్ ముందు తన మొహాన్ని చూపించి ఆ తర్వాత క్యాబిన్‌లో నిద్రపోతున్న ధోని వీడియోనూ తీసింది. మహేంద్రుడు పక్కనే అతని భార్య సాక్షి సింగ్ ఫోన్ చూస్తూ ఉండడం మనం ఈ వీడియోలో చూడొచ్చు.
కేరళ రాష్ట్ర రాజధాని నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆదివారం, విమానంలోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో సమస్య కారణంగా టేకాఫ్ అయిన రెండు గంటలకే తిరిగి వచ్చిందని తిరువనంతపురం విమానాశ్రయ అధికారులు తెలిపారు.
సోనియా గాంధీ ఫోటోను రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ." అంటూ కామెంట్ రాసుకొచ్చారు.. ఈ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం మధ్యప్రదేశ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు దానిని భోపాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఈ మధ్య కాలంలో విమానాల్లో జరుగుతున్న పలు అంశాలు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎయిరిండియా విమానం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి రావడంతో ఇవాళ (సోమవారం) భారీ విమాన ప్రమాదం తప్పింది. అయితే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 470లో ఒక ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలింది.
ప్రయాణాలు చేయాలంటే చాలా మందికి సరదాగా ఉంటుంది. మరికొందరికి ఇష్టంగా ఉంటుంది. ఇంకొందరికి కష్టంగా ఉంటుంది. మరికొందరికీ భయంగా ఉంటుంది. ప్రయాణాలంటే ప్రజలు ఇన్నీ రకాలుగా స్పందిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువ మందికి ప్రయాణాలు చేయాలంటే సరదా.. సంతోషంగా ఉంటుంది.
ఇండిగో విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన్యం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అవసరమైన మెయింటెనెన్స్ ప్రక్రియలు చేపడతామని ఇండిగో సంస్థ తెలిపింది.
ఇటీవల విమానాల్లో ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్‌లపై లైంగిక వేధింపుల పర్వానికి తెర పడటం లేదు. దుబాయ్-అమృత్సర్ విమానంలో మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడినందుకు ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.