Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు..ఫ్లైట్ లో పేలిన మొబైల్ ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో విమానాల్లో జరుగుతున్న పలు అంశాలు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎయిరిండియా విమానం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి రావడంతో ఇవాళ (సోమవారం) భారీ విమాన ప్రమాదం తప్పింది. అయితే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 470లో ఒక ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలింది. దాంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ వెళ్ళవలసి వచ్చింది. అన్ని సాంకేతిక తనిఖీల తర్వాత విమానం మళ్లీ ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే విమానంలోని మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిపోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేగింది.
Read Also: Bhatti Vikramarka : కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు తలదించుకునేలాగుంది
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ఈ విమానం మధ్యాహ్నం 1 గంటలకు ఉదయ్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే, విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఉదయ్‌పూర్‌లోని దబోక్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో కొంతమంది ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించారు. ఆ తర్వాత విమానాన్ని సరిగ్గా తనిఖీ చేసి, అన్నీ క్లియర్ చేసిన తర్వాతే విమానాన్ని తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు.
Read Also: Liquor Sales: తగ్గిన మద్యం అమ్మకాలు.. పెరిగిన ఆదాయం..
అయితే, గత సంవత్సరం ఏప్రిల్ 14న ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. డిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో వెళుతుండగా మధ్యలో ఫోన్‌లో మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో కూడా ఎలాంటి గాయాలు కాలేదు.. బ్యాటరీతో ఒక్కసారిగా వేడెక్కడంతో ఫోన్ లో మంటలు వచ్చాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. క్యాబిన్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!