ఇటలీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇటలీలోని మిలాన్ నగరంలో ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మిలాన్ లోని లినేట్ విమానాశ్రయం నుంచి సర్దీనియా దీవికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ జెట్ సింగిల్ ఇంజన్ పీసీ 12 విమానం బయలుదేరిన వెంటనే ఇంజన్‌లో మంటలు అంటుకున్నాయి. ఆ విమానం ఓ భవనంపై కూలిపోయింది. దీంతో భవనంతో పాటుగా బయట పార్క్ చేసిన కార్లకు నిప్పు అంటుకున్నది.…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న VTIXK ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేసారు. అయితే విమానంలోని బాత్ రూమ్ లాక్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన ఆధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసారు. అనంతరం… హూటా హూటీన సిఐఎస్ఎఫ్ ఆధికారులను రప్పించి తనిఖీ చేయడంతో విమానంలోని బాత్ రూమ్ లో అక్రమ బంగారం లభ్యం…
దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లోను రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ మిల్కీ బ్యూటీ హవా తెలియంది కాదు. సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్ అందాలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తమన్నా పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన విమానాన్ని అందుకోలేకపోయిందని షేర్ చేసింది. నూడిల్స్ ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఎక్కాల్సిన ఫ్లైట్…
విమానంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. ఓ ఎంపీ పైలట్‌గా మారి విమానాన్ని గాల్లో ఎగిరిస్తే.. మరో ఎంపీ ప్రయాణికుడికిగా అతడితో పాటు ప్రయాణం చేశారు.. అయితే, ఇద్దరూ సుపరిచితులు కావడంతో.. వారి పలకరింపులు, ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యానికి గురికావడం ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఆ అరుదైన ఘటన అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డీఎంకే సీనియర్ ఎంపీ దయానిధి మారన్, బీజేపీ ఎంపీ…
విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ మహిళను సిబ్బంది సీటుకు కట్టేసి ఉంచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్సాస్ నుంచి నార్త్ కరోలీనాకు విమానం బయలుదేరగా, అందులోని ఓ మహిళా ప్రయాణికురాలు గందరగోళం సృష్టించింది. తనను కిందకు దించాలని గొడవచేసింది. అప్పటికే విమానం బయలుదేరాల్సిన సమయం కంటే గంట ఆలస్యం కావడంతో గమ్యస్థానం చేరిన తరువాతే దించుటామని సిబ్బంది తెలిపారు. Read: షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్…
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.. అయితే, తనతో పాటు.. తన అనుచరులను కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్పించాలని భావిస్తున్న ఈటల.. అందరూ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకున్నారట.. ముఖ్యనేతలతో తనతో పాటు హస్తినకు…
నిన్న చెన్నైలో విమానంలో జరిగిన పెళ్లి పై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు అనుమతినిచిన ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి కరోనా టైంలో పెళ్లికి విమానం అద్దెకు ఇచ్చిన స్పైస్ జెట్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఫ్లయిట్ లో కనీసం భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు ధరించకపోవడం పై అసహాయం వ్యక్తం చేసింది. కరోనా…
కరోనా కాలంలో వివాహాలు విచిత్రంగా జరుగుతున్నాయి. కొంత మంది ఆన్‌లైన్ ద్వారా వివాహాలు చేసుకుంటే, మరికొందరు పరిమిత సంఖ్యతో వివాహాలు చేసుకుంటున్నారు. అయితే, తమిళనాడులోని మధురైకు చెందిన ఇద్దరు వ్యాపావేత్తల పిల్లల వివాహం విచిత్రంగా జరిగింది. మధురై నుంచి తుత్తుకూడి వరకు ఓ ప్రైవేట్ జెట్ విమానం బుక్ చేసుకున్నారు. అందులో మొత్తం 161 మంది అతిధులు బయలుదేరారు. మధురై నుంచి విమానం బయలుదేరగానే వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్ తాళి కట్టాడు. మధురై నుంచి…