దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేజ్రీవాల్ ఓటర్లను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు.
ఇండియాలో ఐసీఈ (ICE) వాహనాలతో పాటు ఈవీ (EV)లను ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. ప్రజలు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో.. వాహన తయారీదారులు అద్భుతమైన ఫీచర్లతో కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 2019-మార్చి 2024 మధ్య దేశవ్యాప్తంగా ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అనే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి.
దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సరికొత్త రికార్డును సాధించింది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కొత్త మైలురాయిని సాధించింది. ఈ కారు కేవలం 5.5 ఏళ్లలో 10 లక్షల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఈ కారు చాలా నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు యొక్క కొత్త మోడల్ 2019 జనవరి 23న ప్రారంభించారు. అప్పటి నుండి.. ఈ కారు 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని జమాతే ఇస్లామీపై (Jamaat-e-Islami) కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థపై విధించిన నిషేధంపై తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిటీ యొక్క తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)ని ఐదేళ్లపాటు చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది.
ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ సెలక్షన్ లో తప్పుడు పత్రాలు(నకిలీ వయస్సు సర్టిఫికెట్స్) ఇచ్చినట్లు హెచ్సీఏ నిర్ధారించింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకి వచ్చే ఐదు సంవత్సరాలలో సుమారు రూ.8,200 కోట్లు ఆదాయం సమకూర్చుకునేందుకు బీసీసీఐ అంచనా వేస్తోంది. ఇది కేవలం సొంతగడ్డపై టీమిండియా ఆడే మ్యాచ్‌లకు మాత్రమే వచ్చే ఆదాయంగా తెలిపింది. భారత జట్టు వచ్చే ఐదేళ్లలో సొంతగడ్డపై 88 మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ సన్నాహాలు చేసింది.