BCCI: బీసీసీఐకి వచ్చే ఐదేళ్లలో భారీ ఆదాయం వచ్చే ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకి వచ్చే ఐదు సంవత్సరాలలో సుమారు రూ.8,200 కోట్లు ఆదాయం సమకూర్చుకునేందుకు బీసీసీఐ అంచనా వేస్తోంది. ఇది కేవలం సొంతగడ్డపై టీమిండియా ఆడే మ్యాచ్‌లకు మాత్రమే వచ్చే ఆదాయంగా తెలిపింది. భారత జట్టు వచ్చే ఐదేళ్లలో సొంతగడ్డపై 88 మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ సన్నాహాలు చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లకు సంబంధించి మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ రూ. 8,200 కోట్లు రానున్నట్లు తెలిపింది. మీడియా హక్కుల అమ్మకానికి ఇప్పటికే బోర్డు టెండర్లకు పిలిచింది.
Read Also: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ ఐదేళ్లలో స్వదేశంలో భారత్ జట్టు 25 టెస్టు మ్యాచ్‌లు, 27 వన్డే మ్యాచ్‌లు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ రెడీ చేసింది. ఇందులో ఆసీస్‌తో 21 మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌తో 18 మ్యాచ్‌లు ఉన్నాయి. 2018 – 2023 ఐదేళ్ల కాలంలో బీసీసీఐ మీడియా హక్కుల ద్వారా రూ. 6,138 కోట్లు సంపాదించింది. స్టార్ ఇండియా డిజిటల్, టీవీ హక్కులను దక్కించుకుంది. ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ ధర రూ. 60కోట్లు.. అయితే, ఈసారి.. టీవీ, డిజిటల్ హక్కులను వేరువేరుగా వేలం ప్రక్రియ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
Read Also: Eye Flu Home Remedies: కండ్ల కలక రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
గత ఐపీఎల్ మీడియా హక్కుల వేలం సమయంలో రిలయన్స్ డిజిటల్ బిడ్‌ను గెలుచుకుంది. దీంతో బీసీసీఐకి రూ.48,390 కోట్లు ఇన్ కమ్ వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్ విధానం మాదిరిగా టీవీ, డిజిటల్ హక్కులకు వేరువేరుగా బిడ్‌లను బీసీసీఐ ఆహ్వానిస్తుంది. ఈ బిడ్డింగ్ విధానం ఈ-వేలం నిర్వహించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ఫస్ట్ వీక్ లో వేలం షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించేందుకు రెడీ అవుతుంది. ఈనెల 25 వరకు దరఖాస్తుల గడువు ముగుస్తుంది.
Read Also: PM Modi: జనగామ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
సెప్టెంబర్‌లో నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు పలు కంపెనీలు ఇప్పటికే రూ.15 లక్షల విలువైన బిడ్ పత్రాలను కొనుగోలు చేశారు. అయితే, ప్రధానంగా టీమిండియా ప్రసార హక్కులను కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు పోటీ పడుతున్నాయి. వాటిలో డిస్నీ హాట్‌స్టార్, రిలయన్స్ – వయాకామ్, జీ-సోనీలు ఉన్నట్లు బీసీసీఐ అధికార వర్గాలు తెలిపింది.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!