At least 12 people were killed in a confrontation between police and armed civilians in the town of El Salto, in west Mexico's Jalisco state, state governor Enrique Alfaro confirmed Thursday.
అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. శ్వేతసౌధం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్ అధికారి సహా పలువురికి బుల్లెట్లు తగిలాయి. అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీ 14 అండ్ యూ వీధిలోని జునెటీంత్ మ్యూజిక్ కన్సెర్ట్ సమీపంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఫైరింగ్‌లో ఒకరు మృతిచెందగా.. పోలీస్ అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది. ఈ ఘటన అధ్యక్ష భవనమైన శ్వేత సౌధానికి సమీపంలోనే…
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని సాగా బర్ఖెగా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణజింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్ ఇన్ స్పక్టర్ రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు.…
పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ వ్యక్తి ఆగ్రహంతో ఎలక్ట్రిక్ బైకుపై పెట్రోల్ పోసి కాల్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపత్తూర్ జిల్లా అంబూరుకు చెందిన ఓ వాహనదారుడు చాలా కాలం కిందట ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు…
అమెరికాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. దీనికి తోడు బాంబు పేలుడు కకావికలం చేసింది. బ్రూక్లిన్‌లో రైలు ప్రయాణించే ఓ సబ్వేలో ఐదుగురిపై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో సబ్వే అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో అమెరికాలో గన్ కల్చర్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ లో మాస్క్ తో వచ్చి దుండగులు బీభత్సం కలిగించారు. నిత్యం రద్దీగా వుండే సబ్వే లో కాల్పులతో అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే…
ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఎస్సై ఉమేష్ చంద్ర మృతి చెందారు.కానిస్టేబుల్ స్టిఫెన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే మెస్ లో గోడవే ఈ కాల్పులకు కారణం అని తెలుస్తుంది. అయితే కానిస్టేబుల్ స్టిఫెన్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. నూగూరు వెంకటాపురం పీఎస్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టిఫెన్ లు మెస్ వద్ద గొడవ…
శనివారం నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్ లో పద్నాలుగు మంది పౌరులు చనిపోయారు. తీవ్రవాదులు జాడ గురించి సమాచారం అందటంతో ప్రత్యేక బలగాలు ఈ చర్యకు దిగాయి. కాని, వారు దాడి చేసింది ఉగ్రవాదులపై కాదు..సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై. ఐతే, ఇది పొరపాటున జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి వుంది. మరోవైపు, ఈ సంఘటనను నిరసిస్తూ స్థానికంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోవు రోజులలో ఎలా…
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు జవాన్లు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మారాయిగూడెం వద్ద లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో ఘటన చోటుచేసుకుంది. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్‌కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది.…