ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. సంచలనం కలిగించిన రావులపాలెంలో ఫైనాన్షియర్ పై గన్ తో కాల్పులు చేసి దుండగులు హత్య యత్నంకు పాల్పడిన కేసు నత్తనడకగా సాగుతుంది. దుండగులు ఫైనాన్షియర్ ను ఎందుకు హత్య చేయాలని అనుకున్నారు? కాల్పులకు వాడిన గన్ ఎక్కడది ? బాంబులు ఎందుకు తెచ్చారు? మత్తు ఇంజక్షన్ తెచ్చింది కిడ్నాప్ చేయడానికా? చంపేయడానికా? మిస్టరీగా మారిన రావులపాలెం తుపాకీ కాల్పులు కేసు ఏమైంది?
Read Also: Pragathi : నా మీద గాసిప్స్ వేస్తున్నారా.. ఆటిట్యూడ్ చూపిస్తున్న ప్రగతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఫైనాన్షియర్ పై హత్య యత్నం కేసు జరిగి రెండు వారాలైన ఇంకా మిస్టరీ కొనసాగుతుంది. కేసు మిస్టరీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మారిదిగా ఉంది ఇంతవరకు పోలీసులకు క్లూ దొరకలేదు. సరైన ఆధారాలు లేక కేసు మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి సాగుతుంది. పోలీసులు ఈ విషయంలో సరిగా స్పందించకపోవడం కారణంగా కేసులో ఎటువంటి పురోగతి లభించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనా ప్రాంతంలో లభించిన ఆధారాల ఆధారంగా కేసు దర్యాప్తు సాగకపోవడంతో కేసులో పురోగతి లభించలేదు.
దుండగులు ఫైనాన్షియర్ ను ఎందుకు హత్య చేయాలని అనుకున్నారు? కాల్పులకు వాడిన ఆ గన్ ఎక్కడిది? బాంబులు ఎందుకు తెచ్చినట్టు? మత్తు ఇంజక్షన్ గురించిన సమాచారం ఏదీ లభించలేదు. అదంతా మిస్టరీగా మారింది. అసలు ఈ ఘటనలో బాధితడి కుటుంబం ఫైనాన్స్ లావాదేవీలు ఇతర విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ సాగాలి. రోజులు గడిచేకొద్దీ కేసు పురోగతి విచారణ మందగిస్తుంది. ఎంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ లో గన్ ,బాంబు దాడులు వంటి ఘటన ఇదే ప్రథమం. ఇది ప్రొఫెషనల్ పనా లేక దొంగల పనా? అనేది తేలాలి. ఈ కేసుపై జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ద కనపరిస్తే మంచిది అంటున్నారు స్థానికులు.
Read Also: National Awards: పర్యాటక రంగంలో తెలంగాణకు అవార్డుల పంట