ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఎస్సై ఉమేష్ చంద్ర మృతి చెందారు.కానిస్టేబుల్ స్టిఫెన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే మెస్ లో గోడవే ఈ కాల్పులకు కారణం అని తెలుస్తుంది. అయితే కానిస్టేబుల్ స్టిఫెన్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. నూగూరు వెంకటాపురం పీఎస్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టిఫెన్ లు మెస్ వద్ద గొడవ పడ్డారు. దీంతో కానిస్టేబుల్ స్టిఫెన్ క్షనికావేశంతొ ఎస్సై ఉమేష్ చంద్రను కాల్చడం తో అక్కడికక్కడే మృతిచెందాడు.
అయితే మృతి చెందిన ఎస్సై ని గమనించిన కానిస్టేబుల్ స్టిఫెన్ భయంతో తనకు తాను కాల్చుకుని తీవ్ర గాయల పాలయ్యాడు. ఒకరికొకరు కాల్పులు మృతి చెందిన ఎస్సై ని, గాయాల పాలైన కానిస్టేబుల్ ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఏటూరు నాగారం సామాజి ఆసుపత్రి కీ తరలించారు. మృతి చెందిన ఎస్సై ఉమేష్ చంద్ర స్వస్థలం బిహార్ ఇతనికి ఛాతీలో రెండు తూటాలు, పొట్టలొ ఒక తూట దిగడంతొ అక్కడికక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ స్టిఫెన్ స్వస్థలం కన్యాకుమారి. ఇతనికి గదవ కింద నుండి తల పక్క బాగం నుండి తూట పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అయితే ఈ కాల్పుల ఘటన పై ఎస్పీ విచారణ చేపట్టారు.