Hyderabad Fire Accident: హైదరాబాద్ నగరంలోని మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపో (ICD)లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
Hyderabad: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని P&T కాలనీ రోడ్ నంబర్ 2లో అర్ధరాత్రి తీవ్ర కలకలం రేపింది. దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా టపాసులు కాలుస్తుండగా, ఇంటి ముందు పార్క్ చేసిన కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురాలో గురువారం ఉదయం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్టూన్ గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గోదాంలో…
Murali Mohan : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించే వ్యవస్థ అవసరం స్పష్టమవుతోంది. ఇటీవల పాతబస్తీలో జరిగిన విషాద అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ విషయంలో తీవ్ర ఆవశ్యకతను ముందుకు తెచ్చింది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రావడం గణనీయమైన పరిణామంగా మారింది. ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ మాట్లాడుతూ నగరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి ఆధునిక…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో కలిపి 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు, కృష్ణా,…
Gulzar House: హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం మృత్యుపాశాన్ని మోసుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో ఓ కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆ విషాదానికి మూలంగా అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్న ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభావిత భవనానికి ఎదురుగా ఉన్న నగల దుకాణం రాత్రి మూతపడిన అనంతరం, అక్కడి కొన్ని కుటుంబాలు హైటెన్షన్ వైర్ నుంచి కరెంట్‌ను కోక్కేల ద్వారా అక్రమంగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ…
హైదరాబాద్‌లోని మైలార్ దేవ్ పల్లెలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో 53 మంది చిక్కుకున్నారు. భవనం నుంచి బయటికి వెళ్లేందుకు ఉన్న మెట్ల దగ్గరే భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని వాళ్లంతా..
హైదరాబాద్‌లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసి ప్రెస్ నోట్‌లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Fire Accident : చార్మినార్ సమీపంలోని మీర్‌చౌక్‌లో చోటుచేసుకున్న దుర్మార్గమైన అగ్నిప్రమాదం ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (TFDRT) అధికారికంగా స్పందించింది. ఈ ఘటన ఉదయం 6:16 గంటల ప్రాంతంలో జరిగిందని, వెంటనే అప్రమత్తమైన మొగల్‌పురా ఫైర్‌స్టేషన్ సిబ్బంది కేవలం 10 నిమిషాల్లోనే ఘటన స్థలానికి చేరుకున్నారని పేర్కొన్నారు. Mahendran : మణిశర్మ చేతుల మీదుగా ‘వసుదేవ సుతం’ గ్లింప్స్…
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది.