Fire Accident : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద గల సోఫా తయారీ షాపులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుల్మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద మహావీర్ సోఫా వర్క్స్, మస్కిటో డోర్స్ షాప్ చాలాకాలంగా నిర్వహిస్తున్నారు. ఈ షాపులో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధం అయింది. అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. షాపులోని సోఫాలు, ఇతర సామాగ్రి…
Bus Fire Accident : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి వద్ద ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజి బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రేపల్లె పట్టణంలోని ఐఆర్ఈఎఫ్ సంస్థలకు చెందిన నర్సింగ్ మొదటి సంవత్సరం విద్యార్థినులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం గుంటూరు కావడంతో, 30 మంది విద్యార్థినులను పరీక్ష రాయించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. సరిగ్గా గూడవల్లి వద్దకు రాగానే బస్సులో పొగలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తై బస్సును ఆపాడు. విద్యార్థులను హుటాహుటిన…
Fire Accident : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని SSV ప్యాబ్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది.. ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారీ కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. సంఘటనా స్థలానికి 3 పైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపుచేయడానికి పైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. ఆస్తి నష్టం భారీ గా ఉండవచ్చని సమాచారం.. సంఘటనా స్థలానికి జీడిమెట్ల సీఐ, బాలానగర్ ఏసీపీ చేరుకొని పర్యవేక్షిస్తున్నారు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఇంకా…
Diwali 2024 : దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు లేదా విద్యుత్ దీపాల కారణంగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన , అగ్నిమాపక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేసింది. అగ్నిమాపక నియంత్రణ గదిలో పనిచేసే అధికారులు , స్టేషన్లలో పురుషుల సెలవులు రద్దు చేయబడ్డాయి , 24 గంటలూ అప్రమత్తంగా ఉంచబడ్డాయి. క్రాకర్లు కాల్చేటప్పుడు, దీపాలు లేదా కొవ్వొత్తులను వెలిగించేటప్పుడు , షార్ట్ సర్క్యూట్‌ల కారణంగా నివాస…
టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలతో ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌లో గత రెండేళ్లుగా అగ్నిప్రమాదాలు పెరిగిపోవడంతో రానున్న వేసవిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక శాఖతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) యొక్క ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ కూడా నివాసితుల భద్రతను నిర్ధారించడానికి సన్నద్ధమవుతోంది. నగరంలో పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, కార్యాలయ…
Minister KTR: సికింద్రాబాద్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై సమీక్ష చేపట్టారు మంత్రి కేటీఆర్.. అనుమతులు లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో కేటీఆర్‌తో పాటు.. మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరలు పాల్గొన్నారు.. పలు ప్రతిపాదనలు, సూచనలు…
సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చింతచెట్టునుంచి మంటలు రావడంతో కలకలం రేగింది. జీడిమెట్ల 31 బస్ స్టాప్ వుండే పాలికా బజార్ లో భారీ చింత చెట్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పొగలు చిమ్ముతోంది చింత చెట్టు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చింతచెట్టు లోలప మంటలు అంటుకొని పొగలు కక్కుతోంది. https://ntvtelugu.com/goa-driver-kidnap-case-what-happend/ పక్కనే ఉన్న ఇళ్లలోకి దట్టమైన పొగలు చేరుకుంటున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే…
ఏపీలో విచిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్లలో టికెట్ల రచ్చ కొనసాగుతుండగా వివిధ జిల్లాల్లో థియేటర్ల సీజ్ వివాదం రేపుతోంది. థియేటర్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే థియేటర్లను మూసేస్తున్నారు. ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్స్, ఉల్లంఘనపై పూర్తిగా నిఘా పెట్టారు. క్యాంటీన్లను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. థియేటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు, పోలీసులు. కలెక్టర్లు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రతీ చోటా థియేటర్ కు…