Massive Fire In Pakistan's Islamabad: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపుగా 300 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇస్లామాబాద్ లోని ప్రముఖ సండే బజార్ లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో దుకాణాలు, స్టాళ్లు అగ్నికి దగ్ధమయ్యాయి. సెకండ్ హ్యాండ్ బట్టలు, కార్పెట్లను విక్రయించే బజాల్ లోని గేట్ నంబర్ 7 సమీపంలో మంటలు ప్రారంభం అయ్యాయి. భారీగా ఎగిసిపడిన మంటలను ఆర్పేందుకు 10 ఫైర్ ఇంజన్లు…
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథ్ ప్యాలెస్లో అగ్నిమాపక సిబ్బంది వరుసగా మూడో రోజు శనివారం కూడా మంటలను ఆర్పేందుకు శ్రమిస్తుండగా.. భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
చైనాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది మంటలకు ఆహుతి అయ్యారు. వాయువ్య చైనాలోని షింజియాంగ్లో ఓ అపార్ట్మెంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
అసోం-నాగాలాండ్ సరిహద్దులో అసోంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోకాజన్ సమీపంలోని లాహోరిజాన్ ప్రాంతంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి.
మాలేలో విదేశీ కార్మికుల నివాసం ఉంటే ఇరుకైన భవనంలో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.. మొత్తం 11 మంది మరణించారు మరియు పలువురు గాయపడినట్టు అగ్నిమాపక శాఖ తెలిపింది. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్కు చెందిన వారు ఉన్నారని భద్రతా అధికారి తెలిపారు