3 Minors Among 5 Of Family Killed After Fire Breaks Out In UP: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. అగ్ని ప్రమాదంలో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలోని మౌ జిల్లాలోని షాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. అగ్నిప్రమాదం విషయం తెలిసిన అధికారులు వెంటనే సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.
Read Also: India Squad: శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టు ప్రకటన
మౌ జిల్లా కోజగంజ్ పీఎస్ లో పరిధిలోని షాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదంలో ఒక మహిళతో పాటు ముగ్గురు మైనర్లు, మరో వ్యక్తి మొత్తం ఐదుగురు మరణించారని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, వైద్యం బృందం సంఘటన స్థలానికి చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. స్టవ్ వెలగించడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చనిపోయిన వారికి ఒక్కో వ్యక్తికి రూ.4 లక్షల సాయం ప్రకటించింది యూపీ ప్రభుత్వం.