నగర శివార్లలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో పారిశ్రామిక వాడలో ఓ ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో పరిశ్రమ పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. భయాందోళనలతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఆ అగ్నికీలల్లో మూడేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. మూడేళ్ల బాలిక తన ఇంటి పైకప్పుకు నిప్పంటుకోవడంతో సజీవ దహనమైందని పోలీసులు ఆదివారం తెలిపారు.
గత కొంతకాలంగా హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వరుస అగ్ని ప్రమాదాలను నగరవాసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ ఉదయం మరో అగ్ని ప్రమాదం కలకలం రేపుతుంది.
నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెండో అంతస్తుకు వ్యాపించాయి.
సికింద్రాబాద్ ప్రాంతంలోని రామ్గోపాల్పేట్లో ఉన్న డెక్కన్ నైట్వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో షార్టు సర్క్యూ్ట్ కారణంగా మంటలు చెలరేగాయి.
మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ సెంటర్ లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్లో ఉన్న షాపుల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు 4 షాపులు పూర్తిగా దగ్దమయ్యాయి.