దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని కరంపురాలోని మోతీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కర్మాగారంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సెక్రటేరియట్ , రామాంతపూర్లో వరుస ఘటనలు మరువక ముందే తాజాగా కూకట్ పల్లి లోని పార్క్ షేడ్స్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం భాగ్యనగర వాసులకు భయాందోళనకు గురయ్యారు.
Reactor Blast: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడంలో ఉన్న ఎస్వీఆర్ ఫ్యాక్టరీలో ఆదివారం రియాక్టర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి.
సికింద్రాబాద్ రైలు నిలయంలోని పాత క్వార్టర్స్లో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నగర శివార్లలోని జిన్నారం మండలం గడ్డ పోతారంలో పారిశ్రామిక వాడలో ఓ ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలతో పరిశ్రమ పరిసరాల్లో మంటలు వ్యాపించాయి. భయాందోళనలతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఆ అగ్నికీలల్లో మూడేళ్ల చిన్నారి సజీవ దహనమైంది. మూడేళ్ల బాలిక తన ఇంటి పైకప్పుకు నిప్పంటుకోవడంతో సజీవ దహనమైందని పోలీసులు ఆదివారం తెలిపారు.
గత కొంతకాలంగా హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వరుస అగ్ని ప్రమాదాలను నగరవాసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ ఉదయం మరో అగ్ని ప్రమాదం కలకలం రేపుతుంది.
నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.