Fire Accident: కెమికల్ డ్రమ్ములు తీసుకెళ్తున్న డీసీఎం వాహనం లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో డీసీఎం పూర్తిగా కాలిపోయింది. మంటలు భారీగా వ్యాపించడంతో పక్కనే ఉన్న మరో కారుకు నిప్పు అంటుకుంది. దీంతో ఆ కారు కూడా మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం భీరంగుడ కమాన్ సమీపంలో జాతీయ రహదారి పై రసాయనాలతో నిండిన డ్రమ్ములు తీసుకెళ్తున్న డీసీఎంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆ డీసీఎం పూర్తిగా దగ్ధమైంది.
Read Also: MLC Kaushik Reddy: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
మంటలు పక్కనే ఉన్న కారుకు వ్యాపించడంతో అది పూర్తిగా కాలిపోయింది. మంటలు చెలరేగిన విషయం గ్రహించిన డీసీఎం డ్రైవర్ వాహనాన్ని పక్కకు అపడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి కావడం తో భారీగా ట్రాఫిక్ జాం అవ్వడంతో పోలీస్ లు ఘటనా ప్రదేశానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Read Also: Karnataka: రోహిణి వర్సెస్ రూప.. రచ్చకెక్కిన సివిల్ సర్వెంట్లు.. ప్రభుత్వం ఆగ్రహం..