ఈమధ్యకాలంలో అసాంఘిక కార్యకలాపాలు సాగించేవారు ఎక్కువయ్యారు. వివిధ కాలనీల్లో నివసిస్తున్న వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. విజయవాడలో వైఎస్సార్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ ఎసిపి హనుమంతరావు ఆధ్వర్యంలో కొనసాగిన కార్డన్ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు,ఆటోలు, స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పోలీసులు అనుమానితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించారు. తాజాగా ఇదే కాలనీలో గంజాయి తాగుతూ పట్టుబడ్డారు 10 మంది యువకులు. మత్తు పదార్దాల వినియోగంపై ఫోకస్ పెట్టారు పోలీసులు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా తుగ్గలి (మం) రాతనలో 4 గడ్డి వాములు దగ్ధం. అర్ధరాత్రి పెద్దఎత్తున మంటలు ఎగసివపడడంతో గడ్డివాముల వైపు పరుగులు తీశారు గ్రామస్తులు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు 4 లక్షలు ఆస్తినష్టం జరిగింది. గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ ఇంజన్ రావడంతో అదుపులోకి వచ్చాయి మంటలు.
Read Also:Aligarh Mosque: హోలీ సందర్భంగా అలీగఢ్ మసీదుకు ముసుగు..