కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌లోని ఓ స్క్రాప్ గోదాములో ఈ రోజు తెల్లవారుఝామున అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోదాము నుండి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,స్తానిక పోలిసులు మంటలను వ్యాపించకుండా జీడిమెట్ల, సనత్ నగర్,కూకట్ పల్లి కి చెందిన 4ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారని జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ సంఘటనలో ఎవరికి ప్రాణహానీ జరగలేదని, 4 స్క్రాప్ గోదాములు 2 ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ షెడ్లు, అశోక్ లీల్యాండ్ గూడ్స్ వాహనం, మారుతి 800 కారు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లు పోలీసులు సమచారం అందించారు.
Also Read : TCS on ChatGPT: చాట్‌జీపీటీపై టీసీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. నిన్న సూర్యాపేట జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చివ్వెంల మండలం గుంపుల శివారులో హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై రెండు బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులూ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం వేకువజామున హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ‘వెన్నెల’ బస్సులో సాంకేతికలోపం తలెత్తింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. ప్రయాణికులను వేరే బస్సుల్లో పంపించారు.
Also Read : ABVP : నేడు మెడికల్ కాలేజీల బంద్‌కు పిలుపు..