జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో అగ్ని ప్రమాదం సంభవించింది. కమర్షియల్ భవనంలోని పై అంతస్తులో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాం పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read : United Nations: ఉక్రెయిన్ vs రష్యా.. ఇప్పటివరకు 8వేల మంది పౌరులు బలి
వలస కూలీలు (భవన నిర్మాణ కార్మికులు) ఏర్పాటు చేసుకున్న రేకుల గుడిసెలో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు 30 గుడిసెల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ముందుగా ఒక గుడిసెలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కూలీలు తమతమ ఇళ్లలోని సామాన్లను బయటకు తీసుకున్నారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
Also Read : Mystery Revealed : మిస్సింగ్ రైలు మిస్టరీ వీడింది.. వేలకోట్లు విలువ చేసే సామాగ్రితో
మరోవైపు.. సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పఠాన్ చెరు బీరంగూడలో ఆగి ఉన్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో.. డీసీఎంలో చెలరేగిన మంటలు వ్యాపించి పక్కనే ఉన్నా కారు, మినీబస్సుకు అంటుకున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కరెంట్ ఆయిల్ తీసుకెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు అధికారులు. ప్రమాదంలో మూడు వాహనాలు పూర్తిగా దగ్థం అయ్యాయని, అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
Also Read : IPhone : హౌరా.. పాత ఐఫోన్‌కు 57 లక్షలా..? ఎందుకంత డిమాండ్..