హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి.. షార్ట్ సర్కుట్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. రంగారెడ్డి జిల్లా.. మైలార్ దేవులపల్లి.. టాటానగర్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాంకెట్ గోడౌన్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో గోడౌన్ లో 10 కార్మికులు పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఒక్కసారిగా బయటకు పరుగులు…
Bus Catches Fire: కొన్ని కొన్ని సార్లు అంతా సవ్యంగా ఉంది అనుకున్నా కూడా అనుకొని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఒక ఘటనే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జరిగింది. ఒక హైవే పై అప్పటి వరకు మంచిగా వెళ్తున్న బస్సులో సడెగా మంటలు వ్యాపించాయి. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.డ్రైవర్ అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో ప్రకారం…
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ బహుళ అంతస్థుల ఆసుపత్రిలో ఇవాళ (ఆదివారం) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం విచారణ ముగిసింది. బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ టీమ్ మంటల్లో కాలిపోయిన బోగీలను తనిఖీ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు చెబుతామని అధికారులు చెప్పారు.
బస్సుల్లో ప్రయానించాలంటే జనాలు వణికిపోతున్నారు.. అటు రైలు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకప్పుడు ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. కానీ ఈ మధ్య ప్రభుత్వం బస్సుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.. మొన్న కూకట్ పల్లి బస్సు ప్రమాదం మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ లో మరో బస్సు ప్రమాదానికి గురైంది.. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు ప్రయాణం అంటే గుండెల్లో వణుకు పుడుతుంది.. అయితే ఏసీ బస్సుల్లో ప్రమాదాలు…
China: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్పిజి గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో 31 మంది దుర్మరణం పాలయ్యారు. వాయువ్య చైనాలోని యిన్చువాన్లోని రెస్టారెంట్లో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.