బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాయ్‌పూర్‌లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రెస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది విజయవంతంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకొని అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోండ్వారా ప్రాంతంలో ఉన్న శ్రీ గురునానక్ మ్యాట్రెస్ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక…
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఉదయం ఓ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. 4 అంతస్తుల భవనంలో మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో అక్కడిక్కడే 3 వ్యక్తులు మరణించగా, ఒకరు గాయపడ్డారు. తూర్పు ఢిల్లీ లోని కృష్ణ నగర్ ప్రాంతం లో ఉన్న 4 అంతస్తుల నివాస భవనంలో ఈ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సమయంలో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ కు ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్…
గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తును చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేవారు. అలాగే, మృతుల కుటుంబాలందరికీ సత్వర న్యాయం అందించాలని రాహుల్ గాంధీ కోరారు.
ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని రెండంతస్తుల బేబీ డే కేర్ సెంటర్లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ కేంద్రంలో 11 మంది నవజాత శిశువులు జాయిన్ అయ్యారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడి మరణించారు.
Fire Accident : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడ ఇనుము కరిగించే కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని బాంకెట్ హాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో నగరంలోని 50 ఇంజిన్లను ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సమాచారం. కాకపోతే బాంకెట్ హాల్ మొత్తం కాలిపోయింది. అలీపూర్‌లోని కార్నివాల్ బాంక్వెట్ హాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘ్తాంకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Shocking: బిడ్డ లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు చీల్చిన కసాయి భర్త..…
పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి బయటకు దూకిన సిబ్బంది ప్రాణాలు దక్కించుకున్నారు. మధ్య ప్రదేశ్ లోని బేతుల్ జిల్లా గౌలా గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా సెషన్స్ కోర్టు వెలుపల భారీ అగ్నిప్రమాదం జరిగింది. న్యాయవాదుల ఛాంబర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లాయర్లు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
Fire breaks out at DRR Studio Rajarhat: అదేంటి టాలీవుడ్ అంటున్నారు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టూడియోకి ఏమైనా అయింది అనుకుంటే పొరపాటే. అగ్ని ప్రమాదం జరిగింది ఇక్కడ కాదు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో. నిజానికి బెంగాల్ సినీ పరిశ్రమను కూడా టాలీవుడ్ అనే అంటారు. ముందుగా వారి వాడకంలో ఉన్న పేరునే మన వాళ్ళు అరువు తెచ్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే కోల్కతారాజర్హట్లో ఉన్న ప్రముఖ సినిమా షూటింగ్ స్టూడియోలో అగ్నిప్రమాదం…
రాజస్థాన్‌లోని కోటాలో బాలుర హాస్టల్ భవనం ఆదర్శ్ రెసిడెన్సీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు.