Minister Anagani Satya Prasad : అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటన కలకలం సృష్టిస్తోంది.. ఈ ఘటనపై రెండోసారి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు… ఉదయం నుంచి జరుగుతున్న దర్యాప్తు అంశాలపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు సీఎం.. దగ్దమైన దస్త్రాలు ఏయే విభాగాలకు చెందినవి, ఆధారాల సేకరణలో నిర్లక్ష్యానికి కారకులెవరు అనే అంశాలపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిని కప్పి పుచ్చేందుకే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి వేయి కోట్ల అవివీతి బాగోతం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు.. ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం మొన్నటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంట్రోల్లోనే ఉందని విమర్శించారు.
Read Also: Raj Tarun- Lavanya: రాజ్ తరుణ్ నా ఫ్రెండ్.. ఆవేశంతో ఊగిపోయిన RJ శేఖర్ భాషా
మరోవైపు.. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ల్యాండ్ కన్వెర్షన్ జరిగిందని విమర్శించారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ల్యాండ్ కన్వెర్షన్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ ప్రశ్నించిన తర్వాతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం ఘటన చోటు చేసుకుందన్న ఆయన.. పెద్దిరెడ్డి మీద.. స్థానిక వైసీపీ నేతల మీదే మాకు అనుమానం ఉందన్నారు.. ఆదివారం పూట ఉద్యోగులు పని చేయడం ఎందుకు..? అని ప్రశ్నించారు. ఆర్డీవో, ఎమ్మార్వో సహా ఉద్యోగులు, అధికారుల మొబైల్స్ సీజ్ చేశాం. ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించమని స్పష్టం చేశారు.. అవినీతి ఆరోపణలు ఫైళ్లు మాయం అవుతున్నాయి.. దగ్ధం అవుతున్నాయి. ఉద్యోగులు పని చేస్తే సక్రమంగా చేయండి.. లేకుంటే పక్కకు తప్పుకోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వ అవినీతిని కప్పి పుచ్చేలా ఉద్యోగులు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.