విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు NAFC యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో ( Delhi) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలు పాలైనట్లు తెలుస్తోంది. 22 అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపులోకి తెచ్చాయి.
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మారుమూల గ్రామంలో ఇవాళ తెల్లవారు జామున ఇంటికి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మైనర్ బాలికలు సజీవదహనం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్ అకాడమీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంస్థలోని క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు నాసిన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం పై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్…
China: చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 39 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 9 మంది గాయాలపాలయ్యారు. తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్సులోని జిన్యు నగరంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.
హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా ఇవాళ మింట్ కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.