Fire Accident: హనుమకొండ చౌరస్తా లో ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ లోని ఖాదీమ్స్ ఫుట్ వెర్ షాప్ లో షార్ట్ సర్కుట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. షాప్ లోని ఒకటోవ, రెండొవ అంతస్తు లోనూ మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. ఫుట్ వేర్ షాప్ ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. స్థానిక సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. రోడ్డు ఇరువైపు ప్రయాణికులను, స్థానికులను, పక్కనే వున్న షాపులను అక్కడి నుంచి ఖాలీ చేయించారు.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
అనంతరంలో ఖాదీమ్స్ ఫుట్ వెర్ షాప్ లో భారీగా మంటలు రావడంతో ఫైర్ సిబ్బంది మంటలు అర్పే ప్రయత్నం చేశారు. సుమారుగా నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అయితే అగ్ని ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు ఘటనాస్థలి వద్దకు చేరుకున్నారు. జేసీబీ సహాయంతో మొదటి అంతస్థు షెటర్ తెరచి, మంటలను ఆర్పి వేశారు.మూడు ఫైర్ ఇంజన్స్ తో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. షాపులోనీ సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి కాగా.. చాలా వరకు ఆస్థి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. హనుమకొండ చౌరస్తాలోని ప్రధాన రహదారి పక్కన షాప్ ఉండటం వళ్ళ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలిపారు. అగ్నిప్రమాద ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
Arunachalam: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జులై 19 నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు..